yarapathineni comments: బడుగు బలహీన వర్గాల వారిని రాజకీయంగా అందలం ఎక్కించిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. గురజాలలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత శంఖారావం సభలో ఆయన పాల్గొన్నారు. మూడున్నరేళ్లుగా వైసీపీ అరాచకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరిగాయని మండిపడ్డారు. వారి అభివృద్ధికి కేటాయించిన సబ్ ప్లాన్ నిధులను సైతం దారి మళ్లించారని ఆక్షేపించారు. తెలుగుదేశానికి ఓటేసిన వారిని గ్రామాల్లోకి రాకుండా వైసీపీ అడ్డుకుంటుందన్నారు. అరాచకాలకు తెగబడిన వారందరికీ త్వరలోనే గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
వైసీపీకి త్వరలోనే గుణపాఠం చెబుతాం: యరపతినేని - ఏపీ వార్తలు
yarapathineni comments: వైసీపీ అరాచకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయిందని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. గురజాలలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత శంఖారావం సభలో ఆయన పాల్గొన్నారు. త్వరలోనే వైసీపీ అరాచకాలకు గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
యరపతినేని శ్రీనివాసరావు