ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మా పార్టీ కార్యకర్తలపై దాడి చేస్తే.. ప్రతిఘటన తప్పదు: జూలకంటి బ్రహ్మారెడ్డి - brahmareddy comments on macherla incident

JULAKANTI BRAHMAREDDY : పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే మాచర్లలో అల్లర్లు జరిగేవి కావని ఆ నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్​ జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రశ్నించారు. మాచర్ల ఘటనకు సంబంధించి స్థానిక పోలీస్​స్టేషన్​లో కండిషనల్​ బెయిల్​పై రిలీజ్​ అయ్యారు.

JULAKANTI BRAHMAREDDY
JULAKANTI BRAHMAREDDY

By

Published : Jan 9, 2023, 9:44 AM IST

TDP INCHARGE JULAKANTI : టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి జరిగితే ఇప్పటి వరకూ బాధ్యులపై చర్యలు తీసుకోలేదని.. ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని మాచర్ల నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రశ్నించారు. పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటే మాచర్లలో అల్లర్లు జరిగేవి కావని అభిప్రాయపడ్డారు. శాంతియుతంగా, ప్రజాస్వామ్య యుతంగా తాము పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నామని.. తమపై దాడి చేస్తే ప్రతిఘటన తప్పదని బ్రహ్మారెడ్డి స్పష్టం చేశారు. సున్నిత పరిస్థితుల మధ్య గుంటూరు నుంచి ప్రైవేటు బస్సులో తన అనుచరులతో మాచర్ల చేరుకున్న బ్రహ్మారెడ్డి.. స్థానిక పోలీసు స్టేషన్‌లో కండిషన్ బెయిల్ పై సంతకాల అనంతరం అదే బస్సులో తిరుగు పయనమయ్యారు.

మా పార్టీ కార్యకర్తలపై దాడి చేస్తే.. ప్రతిఘటన తప్పదు

ABOUT THE AUTHOR

...view details