Special Pooja for Lokesh Yuvagalam Padayatra: ఈనెల 27వ తేదీ నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టనున్న యువగళం పాదయాత్ర విజయవంతం కావాలని పల్నాడు జిల్లాలో తెలుగు మహిళా నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిలకలూరిపేటలోని ఎన్టీఆర్ కాలనీలో షిరిడి సాయినాధుని ఆలయంలో లోకేశ్ పేరు మీద అర్చనలు చేశారు. చిలకలూరి పేట పార్టీ కార్యాలయం నుంచి తెలుగు మహిళలు కాలినడకన బాబా ఆలయానికి చేరుకొని ప్రదక్షిణలు చేశారు. లోకేశ్ పాదయాత్రకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆటంకాలు కలిగకుండా చూడాలని బాబాను వేడుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
లోకేశ్ పాదయాత్ర విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు - AP NEWS LIVE UPDATES
Special Pooja for Lokesh Yuvagalam Padayatra: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్మి నారా లోకేశ్ పాదయాత్ర విజయవంతం కావాలని రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు చేపట్టారు. పాదయాత్రలో వైసీపీ ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆటంకాలు కలగకుండా ముందుకు సాగాలని పల్నాడు జిల్లాలో తెలుగు మహిళా నేతలు కాలినడకన ఆలయానికి వచ్చి అభిషేకాలు చేశారు.
కుప్పంలో ఈ నెల 27న లోకేశ్ చేపట్టబోయే యువగళం పాదయాత్ర విజయవంతం కావాలని అనంతపురంలో తెలుగు మహిళలు, టీడీపీ నేతలు, కార్యకర్తలు పూజలు జరిపారు. ఆర్ఎస్ రోడ్డు పక్కన హౌసింగ్ బోర్డు కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద 101 టెంకాయలు పూజలు చేశారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం లోకేశ్ చేపట్టే యాత్రకు అడ్డంకులు లేకుండా చూడాలని దేవుని కోరుకున్నారు. వైసీపీ అరాచక పాలన పోయేలా ప్రజలను ఆశీర్వదించాలని టీడీపీ శ్రేణులు మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం టెంకాయలు కొట్టి నినాదాలు చేశారు.
ఇవీ చదవండి: