ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

suspected death: పాప అనుమానాస్పద మృతి.. భార్యే చంపిందంటూ భర్త ఫిర్యాదు - కుతురును చంపిన తల్లి ధనలక్ష్మి

పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో బాలిక అనుమానాస్పదంగా మృతి చెందింది. ప్రియుడితో కలిసి తల్లే హత్యచేసిందని తండ్రి పోలీసులకి ఫిర్యాదు చేశాడు. ప్రసాద్‌ ధనలక్ష్మిలకి పది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వారికి నాలుగు సంవత్సరాల పాప ఉంది. ఇటీవల భార్య భర్తలు విడిపోగా భార్య ధనలక్ష్మి స్థానిక వాలంటీర్‌తో సహజీవనం చేస్తోంది.

suspected death
పాప అనుమానాస్పద మృతి

By

Published : Oct 1, 2022, 4:49 PM IST

Updated : Oct 1, 2022, 6:57 PM IST

Suspected Death in Palnadu District: పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో నవ్య శ్రీ (4) అనే చిన్నారి అనుమానాస్పదంగా మృతి చెందింది. తల్లి మాత్రం అనారోగ్యంతో మృతిచెందినట్లు చెబుతుండగా, తండ్రి మాత్రం తల్లే ప్రియుడితో కలిసి హత్య చేసిందని అంటున్నాడు. ఈ విషయంపై చిన్నారి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. క్రోసూరు మండలం బయ్యవరం గ్రామానికి చెందిన సోమరౌతు ప్రసాద్​కు​ నల్గొండ జిల్లా బుగ్గ మాదారం గ్రామానికి చెందిన ధనలక్ష్మితో 10 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి నవ్య శ్రీ (4) అనే పాప ఉంది.

ఇద్దరి మధ్య గొడవలు రావడంతో కొంత కాలంగా వేర్వేరుగా ఉంటున్నారు. పాప మాత్రం తల్లి ధనలక్ష్మి వద్దే ఉంటోంది. ధనలక్ష్మి స్థానిక వాలంటీర్‌తో సహజీవనం చేస్తోంది. నవ్యశ్రీ మృతి చెందిందని ధనలక్ష్మి ప్రసాద్​కు సమాచారం అందించడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చెేపట్టిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు.

Last Updated : Oct 1, 2022, 6:57 PM IST

ABOUT THE AUTHOR

...view details