Girl Question to Minister Ambati: ‘అమ్మఒడి సరే.. అభివృద్ధి ఏదీ? అమరావతిలో రాజధానిని ఎందుకు నిర్మించడం లేదు’ అని డిగ్రీ విద్యార్థిని మంత్రి అంబటి రాంబాబును ప్రశ్నించింది. ఊహించని ఈ ప్రశ్నలకు ఆమెను సమాధానపర్చలేక.. బాగా చదువుకోవాలంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆదివారం పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని 15వ వార్డులో ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో మంత్రితో విద్యార్థిని పిట్టల ప్రవళిక సంభాషణ చర్చనీయాంశమైంది.
మంత్రి:ప్రభుత్వం నుంచి ‘అమ్మ ఒడి’ అందుతోందిగా..
విద్యార్థిని: ‘జగనన్న విద్యా దీవెన’ అందుతోంది. ఈ సాయం సరే.. మరి రాష్ట్రంలో అభివృద్ధి ఏదీ? మూడు రాజధానులంటున్నారు. రాజధాని ఇక్కడే ఉంటే ఉద్యోగావకాశాలు వస్తాయి కదా.. అమరావతిలోనే రాజధానిని ఎందుకు నిర్మించరు?