Son Attack On Mother: పల్నాడు జిల్లా క్రోసూరు మండలం గుడిపాడు గ్రామంలో దారుణం జరిగింది. కన్నతల్లి అని చూడకుండా అమానుషంగా దాడి చేశాడు ఓ కుమారుడు. తనకు చెందిన స్థలంలో తల్లి అశ్రబీ మరుగుదొడ్డి నిర్మాణం చేపట్టిందని ఆమె కుమారుడు ఈసూబు ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతటితో ఆగకుండా తల్లిపై దాడి చేసి.. మరుగుదొడ్డి కోసం నిర్మాణం చేపట్టిన గుంతలో పడేశాడు. అడ్డుకోబోయిన కుటుంబసభ్యులను సైతం బెదిరించాడు. కుమారుడు ప్రవర్తనకు నిరసనగా.. అక్కడే అదే గుంతలో తల్లి అశ్రబీ నిరసనకు దిగింది. తన కుమారుడి నుంచి తనకు రక్షణ కల్పించాలని ఆమె వేడుకున్నారు.
కన్నతల్లిపై పుత్రుడి కర్కశత్వం.. కొట్టి గోతిలో పడేసి... - Son Attack On his Mother
Son Attack On Mother: ఒకప్పుడు తల్లిదండ్రులు కోప్పడినా.. కాస్త మందలించినా.. పిల్లలు బుంగ మూతి పెట్టుకుని అలిగేవాళ్లు. కానీ కాలం మారింది. పిల్లల మనస్తత్వాలూ మారాయి. కొందరు సున్నితంగా ఉంటే.. మరికొందరు క్రూరంగా తయారవుతున్నారు. తాజాగా నవమాసాలు మోసి, కంటికి రెప్పలా పెంచిన కన్నతల్లిపైనే అమానుషంగా దాడి చేశాడో ఓ సుపుత్రుడు.. అడ్డుకోబోయిన వారిని సైతం బెదిరించాడు. ఈ ఘటన పల్నాడు జిల్లాలో జరిగింది.
తల్లి అశ్రబీ