jagananna houses video: పల్నాడుజిల్లా నరసరావుపేట మండలం ఉప్పలపాడు వద్ద నిర్మాణమవుతున్న జగనన్న ఇళ్లు నాసిరకంగా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో మంగళవారం ఓ వీడియో వైరల్ అవుతుంది. దీంతో అధికారులు వెంటనే స్పందించారు. హుటాహుటిన పల్నాడుజిల్లా ఇళ్ల నిర్మాణ ప్రాంతాలకు వెళ్లి గృహ నిర్మాణ సంస్థ జిల్లా మేనేజర్ వేణుగోపాలరావు, ఆర్డీవో శేషిరెడ్డి ఇళ్ల నిర్మాణాల వద్దకు చేరుకుని పరిశీలించారు.
జగనన్న ఇళ్ల నిర్మాణంలో నాణ్యత కరువైందని వీడియో వైరల్.. ఏది నిజం? - ఆంధ్ర ప్రదేశ్ వార్తలు
jagananna houses video: జగనన్న ఇళ్ల నిర్మాణంలో నాణ్యత కరువైందని సోషల్ మీడియాల్లో వీడియో వైరల్ అవుతుంది. దీంతో అధికారులు హుటాహుటిన పరిశీలనకు వెళ్లారు. ఇది ఆకతాయిల పనంటూ పల్నాడుజిల్లా గృహ నిర్మాణసంస్థ అధికారి వెల్లడించారు. తప్పుడు వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆకతాయిలపై పోలీసులకు పిర్యాదు చేస్తామని గృహ నిర్మాణ సంస్థ జిల్లా మేనేజర్ వేణుగోపాలరావు చెప్పారు.
అనంతరం గృహ నిర్మాణ సంస్థ జిల్లా మేనేజర్ వేణుగోపాలరావు మాట్లాడుతూ జగనన్న ఇళ్లు నాణ్యతా లోపంగా నిర్మాణం చేస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఆరోపణలు అవాస్తవమన్నారు. ఘటనాస్థలానికి లబ్ధిదారుడిని పిలిపించి విచారించామని తెలిపారు. మెట్లు బల్లని పిల్లర్ స్తంభానికి అనుసంధానించేందుకు వీలుగా మధ్యలో ఐదున్నర అడుగుల వద్ద ఇసుక నింపి డమ్మీగా రంధ్రం ఏర్పాటు చేసినట్లు లబ్ధిదారుడు తెలిపారన్నారు. స్లాబ్ వేసే సమయంలో కాంక్రీట్ తో తిరిగి నింపుతారని వివరించారు. ఇళ్ల నిర్మాణంలో నాణ్యత, సాంకేతిక లోపం లేదని గృహ నిర్మాణ సంస్థ జిల్లా మేనేజర్ వేణుగోపాలరావు వెల్లడించారు. తప్పుడు వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆకతాయిలపై పోలీసులకు పిర్యాదు చేస్తామని తెలిపారు.
ఇవీ చదవండి: