ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పిడుగురాళ్ల బైపాస్ .. ఇంకెన్నాళ్లు టైంపాస్‌ - రోడ్ల విస్తరణ వల్ల ప్రజల సమస్యలు

Adnaki–Narkatpally Bypass Road: రెండు అడుగుల ముందుకు.. మూడు అడుగులు వెనక్కి అన్న చందంగా తయారైంది పిడుగురాళ్ల బైపాస్ రోడ్డు నిర్మాణం. దశాబ్ద కిందట పనులు ప్రారంభమైనా ఇప్పటికీ పూర్తి కాలేదు. వాహనాల రద్దీకి అనుగుణంగా రోడ్డులేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అద్దంకి - నార్కట్‌పల్లి రహదారి పట్టణం మధ్యలో వెళ్తుండడం ప్రమాదాలకు నెలవుగా మారింది.

pidugu ralla Bypass
పిడుగురాళ్ల బైపాస్

By

Published : Nov 28, 2022, 2:09 PM IST

Adnaki–Narkatpally Bypass Road: అద్దంకి - నార్కట్‌పల్లి రహదారి నిర్మాణంలో భాగంగా చేపట్టిన పిడుగురాళ్ల బైపాస్ విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పదేళ్ల కిందట పట్టణం చుట్టూ 6.1 కిలోమీటర్ల మేర బైపాస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దశాబ్దం గడిచినా ఇప్పటికీ 5 కిలోమీటర్ల మాత్రమే పనులు పూర్తయ్యాయి. మరో కిలోమీటర్ తారురోడ్డు వేయాల్సి ఉంది. పిల్లుట్ల వద్ద వంతెన నిర్మాణం, మరోచోట రైల్వేఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం జరగాలి. తొలుత ఓ పెద్ద కంపెనీ బైపాస్ నిర్మాణ బాధ్యతలు తీసుకోగా.. ఆ తర్వాత మరో రెండు సంస్థలు పనులు చేపట్టాయి. మొదట్లో భూసేకరణ సమస్యలు, కోర్టు వివాదాలతో పనులు ఆగిపోయాయి. ఆ తర్వాత మళ్లీ ప్రారంభమైనా ఇప్పటికీ పూర్తి కాలేదు.

అద్దంకి - నార్కట్‌పల్లి రహదారి నిర్మాణంలో పిడుగురాళ్ల బైపాస్ విస్తరణ పనుల పరిస్థితి

ఎప్పుడో మొదలు పెట్టిన బైపాస్‌ రోడ్డు పనులు ఇంకా పూర్తి కాకపోవడం వల్ల.. పిడుగురాళ్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అద్దంకి - నార్కట్‌పల్లి జాతీయ రహదారి పట్టణం మధ్యలో నుంచి వెళ్తుండటం వల్ల ట్రాఫిక్‌ విపరీతంగా పెరిగింది. ప్రతి రోజూ సాయంత్రం 4 నుంచి 6 గంటల సమయంలో ప్రధాన రహదారిపై వాహనాలు బారులు తీరుతున్నాయి. లారీలు, బస్సులతో ఎక్కడికక్కడే ట్రాఫిక్ జామ్‌ అవుతోంది. వాహనాల తాకిడితో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అత్యంత ముఖ్యమైన బైపాస్ రోడ్డు సమస్యను త్వరగా పరిష్కరించాలని ప్రజలు వేడుకుంటున్నారు.

ఇవీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details