గడపగడపలో ప్రజాప్రతినిధులకు సమస్యల సెగ తప్పడం లేదు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అంబటి రాంబాబుకు నిరసన సెగ తగిలింది. తన సోదరుడి పింఛన్ ఎందుకు తొలగించారంటూ ఓ మహిళ మంత్రి అంబటిని నిలదీశారు. తెలుగుదేశం హయాంలో వికలాంగుడికి నెలనెలా పింఛన్ వచ్చేదని.. వైకాపా అధికారంలోకి వచ్చాక పింఛన్ తొలగించారని ఆవేదన వ్యక్తం చేసింది.
'గడప గడపకు' నిరసన సెగ.. మంత్రి అంబటిని నిలదీసిన మహిళ - మంత్రి అంబటి తాజా వార్తలు
Ambati: గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబుకు సమస్యలు స్వాగతం పలికాయి. కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో తన సోదరుడి పింఛన్ ఎందుకు తొలగించారంటూ ఓ మహిళ మంత్రి అంబటిని నిలదీశారు.
!['గడప గడపకు' నిరసన సెగ.. మంత్రి అంబటిని నిలదీసిన మహిళ మంత్రి అంబటిని నిలదీసిన మహిళ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15509085-1101-15509085-1654705390822.jpg)
మంత్రి అంబటిని నిలదీసిన మహిళ
వాలంటీర్ ఉద్దేశ్యపూర్వకంగా పింఛన్ నిలిపివేశారంటూ మంత్రి దృష్టికి తీసుకెళ్లగా 'తొందరపడితే ఎలా ? తర్వాత వస్తుంది లే...' అంటూ మంత్రి అక్కడినుంచి మెల్లగా జారుకున్నారు. సరైన సమాధానం చెప్పకుండానే మంత్రి వెళ్లిపోయారని వికలాంగుడు ఆవేదన వ్యక్తం చేశారు.
మంత్రి అంబటిని నిలదీసిన మహిళ
ఇవీ చూడండి