Missed Private Doctor: పల్నాడు జిల్లా నరసరావుపేటలో అదృశ్యమైన వైద్యుడు సుబ్బారావు క్షేమంగా ఇంటికి తిరిగొచ్చాడు. కుటుంబ సమస్యల వల్లే వెళ్లిపోయినట్లు సుబ్బారావు పోలీసులకు తెలిపాడు. అసలేంద జరిగిందంటే.. ఈనెల 4వ తేదీ నుంచి పూజిత హాస్పిటల్ అధినేత డాక్టర్ వెంకట సుబ్బారావు కనిపించకుండా పోయాడు. దీంతో కంగారుపడిన సుబ్బారావు భార్య సృజనాకుమారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వెంకట సుబ్బారావు.. స్నేహితులతో కలిసి వ్యాపారం చేసి 2కోట్ల రూపాయలు నష్టపోయినట్లు సమాచారం. అదేవిధంగా గతంలో కూడా వైద్యుడు 20 రోజుల పాటు అదృశ్యమై.. గుంటూరులోని ఓ ప్రైవేటు హోటల్లో దొరికాడని పోలీసులు వెల్లడించారు.
నరసరావుపేటలో అదృశ్యమైన వైద్యుడు సుబ్బారావు క్షేమం - private doctor has missed in Narasaraopeta
Missed Private Doctor: స్నేహితులతో కలిసి వ్యాపారం చేశాడు.. రూ.2 కోట్ల మేర నష్టపోయాడు.. అంతే నాలుగు రోజుల నుంచి ఆ వైద్యుడు వెంకట సుబ్బారావు అదృశ్యమయ్యాడు. అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సాయంత్రం సుబ్బారావు క్షేమంగా తిరిగి వచ్చాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
ప్రైవేటు వైద్యుడు అదృశ్యం
పోలీసులు సుబ్బారావు కోసం గాలింపు చేపట్టగానే.. సాయంత్రానికి అతను ఇంటికి క్షేమంగా తిరిగివచ్చాడు. దీంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. కుటుంబ సమస్యల వల్లే వెళ్లినట్లు సుబ్బారావు పోలీసులకు తెలిపాడు.
ఇవీ చదవండి:
Last Updated : Feb 9, 2023, 10:27 PM IST