TDP Leader Venna Balakotireddy Murder Case Update: ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు బాలకోటిరెడ్డిని తుపాకీతో కాల్చి.. హత్య చేసిన కేసులో నిందితులకు తుపాకీని ఎవరు విక్రయించారో కనుక్కున్నారు. తుపాకీని విక్రయించిన రాజస్థాన్ రాష్ట్రం.. బారత్పూర్ జిల్లాకు చెందిన గౌరవ్ సింగ్‌ను నరసరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగిన బాలకోటిరెడ్డి సాయంతో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పమ్మి వెంకటేశ్వరరెడ్డి గెలుపొందాడు. బాలకోటిరెడ్డి బ్రతికి ఉంటే తనకు గుర్తింపు రాదని.. అతన్ని అడ్డు తొలగించాలని అనుకున్నాడు. దీంతో గత సంవత్సరం జులై 19వ తేదీన బాలకోటిరెడ్డిపై పమ్మి వెంకటేశ్వరరెడ్డి గొడ్డలితో దాడి చేశాడని పోలీసులు తెలిపారు.
ఈ నేపథ్యంలో నిందితుడి వెంకటేశ్వరరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపారు. తరువాత జైలు నుంచి బయటకు వచ్చిన పమ్మి వెంకటేశ్వరరెడ్డి.. వెన్నా బాలకోటిరెడ్డిపై పగ పెంచుకున్నాడు. గ్రామంలో రాజకీయంగా పట్టు సాధించాలని బాలకోటిరెడ్డిని హత్య చేసేందుకు మరోసారి కుట్ర పన్నాడు.
ఆ హత్య తనపై రాకుండా ఉండేందుకు జైలులో పరిచయమైన ఒంటిపులి వెంకటేశ్వర్లు, పులి అంజిరెడ్డిల ద్వారా రాజస్థాన్‌కు చెందిన గౌరవ్ సింగ్ అలియాస్ ప్రదీప్ గౌరవ్ సహకారంతో ఒక తుపాకీ, 6 బుల్లెట్లను.. పమ్మి వెంకటేశ్వరరెడ్డి కొనుగోలు చేశాడు. ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ.. అర్ధరాత్రి సమయంలో పమ్మి వెంకటేశ్వరరెడ్డి, ఒంటిపులి వెంకటేశ్వర్లు, పులి అంజిరెడ్డి, పూజల రామయ్య.. వెన్నా బాలకోటిరెడ్డి ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించారు.
ఆ సమయంలో ఇంట్లో ఉన్న బాలకోటిరెడ్డిపై.. పమ్మి వెంకటేశ్వరరెడ్డి తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ క్రమంలో తీవ్రగాయాలైన వెన్నా బాలకోటిరెడ్డి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 22వ తేదీన మృతి చెందాడు. ఈ కేసులో కీలకమైన తుపాకీ విక్రయదారుని కోసం పోలీసులు గాలించారు. దీంతో రాజస్థాన్‌కు చెందిన గౌరవ్ సింగ్‌ను అదుపులోకి తీసుకుని నరసరావుపేటకు తీసుకువచ్చినట్లు పల్నాడుజిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి వెల్లడించారు.
TDP Leader Murder Case Update: టీడీపీ నేత హత్య కేసులో.. రాజస్థాన్‌కి చెందిన వ్యక్తి అరెస్ట్ "అలవాలలో ఈ సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీన..బాలకోటిరెడ్డిపైన.. అదే గ్రామానికి చెందిన వెంకటేశ్వర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, అంజిరెడ్డి, రామయ్య దాడి చేశారు. వీరితో పాటు ఆ తుపాకీ ఎక్కడ నుంచి వచ్చింది అనేది ఆ సమయంలో మనందరికీ ప్రశ్నార్థకంగా ఉండేది. దీనిపై దర్యాప్తు చేయగా.. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌కి చెందిన గౌరవ్ సింగ్ అలియాస్ ప్రదీప్ గౌరవ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశాం. ఇతను వెంకటేశ్వర రెడ్డికి తుపాకీ ఇచ్చాడు. ఈ తుపాకీతోనే బాలకోటిరెడ్డిపైన దాడి చేశారు. గౌరవ్ సింగ్‌కి నేర చరిత్ర ఉంది. రాజస్థాన్‌లో కూడా ఇతనిపై పలు కేసులు ఉన్నాయి". -రవిశంకర్ రెడ్డి, ఎస్పీ
ఇవీ చదవండి: