ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హైదరాబాద్‌కు ఆవుల సుబ్బారావు.. రేపటి నుంచి ప్రశ్నించే అవకాశం - Secunderabad Violence case news

Secunderabad Violence: సికింద్రాబాద్ అల్లర్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్‌ ఆవుల సుబ్బారావును పోలీసులు.. నరసరావుపేట నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. బుధవారం నుంచి ఆయనను ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ అల్లర్లలో సాయి డిఫెన్స్ అకాడమీ అభ్యర్థులు పాల్గొన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

Avula Subbarao
Avula Subbarao

By

Published : Jun 21, 2022, 10:13 PM IST

Secunderabad Violence: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ విధానాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో జరిగిన అల్లర్లపై దర్యాప్తు కొనసాగుతోంది. అల్లర్లను ప్రోత్సహించారనే అభియోగాలపై ప్రకాశం జిల్లా కంభంకు చెందిన ఆవుల సుబ్బారావును పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆవుల సుబ్బారావును పోలీసులు నరసరావుపేట నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.

సికింద్రాబాద్ అల్లర్ల కేసులో ఆవులు సుబ్బారావుపై ఆరోపణలు వస్తుండటంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ అల్లర్లలో ఆవుల సుబ్బారావు నిర్వహిస్తున్న సాయి డిఫెన్స్ అకాడమీ అభ్యర్థులు పాల్గొన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. బుధవారం నుంచి హైదరాబాద్​లో ఆవుల సుబ్బారావును ప్రశ్నించే అవకాశం ఉంది.

సికింద్రాబాద్‌ అల్లర్లకు సంబంధించి పలువురు అభ్యర్థులతో సాయి డిఫెన్స్‌ అకాడమీ డైరెక్టర్‌ ఆవుల సుబ్బారావు దిగిన ఫొటోలు వైరలయ్యాయి. దీంతో సికింద్రాబాద్‌ అల్లర్లలో సుబ్బారాపు పాత్ర ఉందన్న అనుమానంతో ఈ నెల 18న పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నరసరావుపేటకు తరలించి విచారిస్తున్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details