NOTICES TO HEALTH MINISTER : పల్నాడు జిల్లా మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి కాన్పుకు వెళితే.. ఫీజు రూపంలో చిన్నారి చిటికెన వేలును ఇవ్వాల్సి వచ్చిందని బాధిత శిశువు తల్లి స్వరూప వాపోయారు. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మంత్రులు తమ శాఖల పనితీరును పట్టించుకోకుండా సీఎంను ప్రశంసించడాన్ని హైకోర్టు న్యాయవాది చీలి విజయ తప్పు పట్టారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి, మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్లకు నోటీసులు ఇచ్చామని తెలిపారు.
కాన్పుకు వెళ్తే.. ఫీజుగా చిన్నారి చిటికెన వేలు - ap viral news
NOTICES TO HEALTH MINISTER : సహజంగా కాన్పుకు ప్రైవేట్ ఆసుపత్రికి వెళితే ఫీజు రూపంలో డబ్బులు కడతాం. అదే ప్రభుత్వాసుపత్రికి వెళ్తే రూపాయి ఖర్చు లేకుండా ప్రసవం జరుగుతుంది. కానీ ఈ గవర్నమెంట్ ఆసుపత్రిలో మాత్రం ఫీజు రూపంలో చిన్నారి చిటికెన వేలును సిబ్బంది తీసుకున్నారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే??
NOTICES TO HEALTH MINISTER