ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా గూండాలను తక్షణమే అరెస్టు చేయాలి : నారా లోకేశ్​ - ysrcp

LOKESH COMMENTS ON MACHERLA ISSUE: పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ మండిపడ్డారు. మాచర్ల నియోజకవర్గంలో పోలీసుల సహకారంతో వైకాపా రౌడీ మూకలు తెలుగుదేశం శ్రేణులపై దాడి చేయడం అన్యాయమన్నారు. వైకాపా గూండాలను వదిలేసి.. తెదేపా కార్యకర్తలపై లాఠీ ఛార్జ్ చేయడం ఏంటని ప్రశ్నించారు.

Nara Lokesh
నారా లోకేష్‌

By

Published : Dec 16, 2022, 10:03 PM IST

LOKESH COMMENTS ON MACHERLA ISSUE: మాచర్ల నియోజకవర్గంలో పోలీసుల సహకారంతో వైకాపా రౌడీమూకలు తెలుగుదేశం శ్రేణులపై దాడికి పాల్పడటం దారుణమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ మండిపడ్డారు. ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహిస్తున్న తెదేపా కార్యకర్తలపై వైకాపా రౌడీలు దాడులకు పాల్పడటం రాష్ట్రంలో అరాచక పాలనకు నిదర్శనమని ధ్వజమెత్తారు. దాడి చేసిన వైకాపా గూండాలను వదిలేసిన పోలీసులు.. తెదేపా కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేయడం, మాచర్ల పార్టీ ఇంఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డిని అదుపులోకి తీసుకోవడం, అధికార పార్టీకి కొమ్ముకాయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా వర్గీయుల కార్లు తగలబెట్టి, దాడులకు పాల్పడిన వైకాపా గూండాలను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. వైకాపా రౌడీ మూకల దాడిలో గాయపడిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details