నగల దుకాణంలో పని చేసే వ్యక్తి హత్య కేసులో వైకాపా నేత పాత్ర.. రోడ్డుపై బంధువుల ధర్నా
18:47 April 23
రామాంజనేయులు హత్యలో.. అన్నవరపు కిషోర్ పాత్ర ఉందని ఆరోపణ
Ramanjaneyulu Relatives Protest for Justice: పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం జొన్నలగడ్డలో ఉద్రిక్తత నెలకొంది. నరసరావుపేటలోని ఓ నగల దుకాణంలో పనిచేసే ఉద్యోగి కిడ్నాప్, హత్య కేసులో వైకాపా నేత అన్నవరపు కిశోర్ పాత్ర ఉందంటూ మృతుడు రామాంజనేయులు బంధువులు ఆరోపించారు. ఈమేరకు భార్య ప్రసన్న లక్ష్మీ, బంధువులు.. కర్నూలు-గుంటూరు రహదారిపై జొన్నలగడ్డ వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. బాధితులకు మద్దతుగా నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం ఇంఛార్జీ చదలవాడ అరవింద బాబు.. రోడ్డుపై బైఠాయించారు. దీంతో గుంటూరు-కర్నూలు రహదారిపై వాహనాల రాకపోకలు స్తంభించాయి.
సమాచారం అందుకున్న పోలీసులు..అక్కడికి చేరుకొని ధర్నా విరమించాలని కోరారు. నిందితులను అరెస్టు చేసేవరకూ వెనక్కి తగ్గేదిలేదని బాధితులు నినాదాలు చేశారు. దీంతో రోడ్డుపై ధర్నా చేస్తున్న ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. తెదేపా నేత అరవిందబాబును అదుపులోకి తీసుకున్నారు. హత్య కేసులో న్యాయం చేయాలని బాధితుల నినాదాలు చేశారు. ఈ క్రమంలో జొన్నలగడ్డలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
ఇదీ చదవండి: