ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సత్తెనపల్లిలో దారుణం.. యువతి గొంతు కోసిన యువకుడు - సత్తెనపల్లిలో దారుణం వార్తలు

ఓ ఉన్మాది యువతి గొంతు కోసిన ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో చోటుచేసుకుంది. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

యువతి గొంతు కోసిన యువకుడు
యువతి గొంతు కోసిన యువకుడు

By

Published : Apr 14, 2022, 6:55 PM IST

Updated : Apr 14, 2022, 7:06 PM IST

పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ఉన్మాది కిరాతకంగా యువతి గొంతు కోసి పరారయ్యాడు. నిందితుడిని తులసీరామ్​గా గుర్తించారు. పార్క్ ఏరియాలో బాధిత యువతితో తులసీరామ్​ సహజీనం చేస్తున్నట్లు తెలిసింది. యువతిపై అనుమానంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది. సత్తెనపల్లి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Last Updated : Apr 14, 2022, 7:06 PM IST

ABOUT THE AUTHOR

...view details