ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుత్​ ప్రమాదం.. తల్లీకుమారుల మృతి - Karampudi electric news

Electrocuted : విద్యుత్​ ప్రమాదం రెండు ప్రాణాలను బలి తీసుకుంది. మృతులు తల్లి కుమారుడు కావడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Electric Shock
విద్యుత్​ ప్రమాదం

By

Published : Nov 24, 2022, 7:32 PM IST

Mother And Son Died in Electric Shock: పల్నాడు జిల్లాలో యువకుడికి విద్యుత్​ షాక్​ తగిలింది. అతడ్ని కాపాడేందుకు తల్లి ప్రయత్నించగా ఆమెకు విద్యుత్​ షాక్​ తగిలింది. ఈ ప్రమాదంతో తల్లీకుమారులిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. కారంపూడి లోని ఇందిరానగర్​కు చెందిన రామకోటయ్య అనే యువకుడు బట్టలు ఆరేస్తుండగా అతనికి విద్యుత్​ షాక్​ తగిలింది. దీనిని గమనించిన తల్లి నాగమ్మ కుమారుడ్ని కాపాడే ప్రయాత్నం చేసింది. ఈ క్రమంలో ఆమెకు విద్యుత్​ షాక్​ తగిలింది. దీంతో తల్లికుమారులిద్దరూ విద్యుత్​ ప్రమాదంతో అక్కడిక్కడే మృతి చెందారు. మృతుడు రామకోటయ్య వయస్సు 30 సంవత్సరాలు కాగా అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెక్కడితేగాని డొక్కడని కుటుంబమని.. వారి కుటుంబంలో ఇలా జరగడం బాధకరమని గ్రామస్థులు అంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details