ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నూజెండ్ల మండలంలో దారుణం.. పిల్లలకు పురుగు మందు తాగించి తల్లి ఆత్మహత్యాయత్నం.. - extramarital affair

Mother child suicide: పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని నూజెండ్ల మండలం తెల్లబాడు గ్రామంలో లో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వివాహిత సౌజన్య లక్ష్మి(26) తన ఇద్దరు పిల్లలకు శుక్రవారం గడ్డిమందు తాగించి తాను తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీనికి కారణం భర్త వివాహేతర సంబంధమేనని సౌజన్య లక్ష్మి తండ్రి ఆరోపించారు. ఈ విషాదంలో చికిత్స పొందుతూ తల్లి, కుమారుడు మృతి చెందగా కుమార్తె పరిస్తితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

suicide
suicide

By

Published : Nov 12, 2022, 10:25 PM IST

Mother child suicide: పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని నూజెండ్ల మండలం తెల్లబాడు గ్రామంలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన వివాహిత సౌజన్య లక్ష్మి(26) శుక్రవారం తన ఇద్దరు పిల్లలకు గడ్డిమందు తాగించి తాను తాగి ఆత్మహత్యకు యత్నించింది. అది గమనించిన బంధువులు ఆ ముగ్గుర్ని నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ సౌజన్య లక్ష్మి (26), ఆమె కుమారుడు మణితేజ(9నెలలు) శనివారం మృతి చెందారు. మృతురాలి కుమార్తె శివ పార్వతి(3) చికిత్స పొందుతోంది. బాలిక పరిస్థితి విషమంగా ఉంది.

ఘటనపై మృతురాలు సౌజన్య తండ్రి కృష్ణ మాట్లాడుతూ తన కుమార్తెను నాలుగేళ్ల క్రితం తెల్లబాడుకు చెందిన మాగం వీరాంజనేయులుకు ఇచ్చి వివాహం చేశామన్నారు. వారికి ఒక పాప, కుమారుడు ఉన్నారని తెలిపారు. అయితే తన అల్లుడు మాగం వీరాంజనేయులుకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉన్న నేపథ్యంలో భార్యాభర్తల మధ్య కొంతకాలంగా మనస్పర్థలు ఉన్నట్లు మృతురాలి తండ్రి కృష్ణ ఆరోపించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నూజెండ్ల పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details