MLA Gadapa Gadapa program: ఆదివారం జరిగిన గడపగడపకు కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డికి వరుస షాక్‌లు తగిలాయి. ఉదయం ముస్లిం కాలనీలో కార్యక్రమం మొదలుపెట్టగా.. కాలనీలో సౌకర్యాలపై ముస్లిం కమిటీ నిరసన వ్యక్తం చేసింది. సచివాలయం 2 పరిధిలోని కాలనీల్లో గోడలపై 'గోబ్యాక్ ఎమ్మెల్యే' అంటూ పోస్టర్లు అతికించారు. 'ఏ నైతిక హక్కుతో మీరు అమరావతి. ముస్లిం కాలనీకి వస్తున్నారు..? రోజువారీ పనులు చేసుకునే ముస్లిం యువతపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించారు... 307 కేసు బనాయించినందుకా..? పేద ముస్లింల పెన్షన్ తొలగించినందుకా..?, షాదీఖానాకు ఒక్క ఇటుక కూడా ఇవ్వనందుకా..? షాదీ తోఫా ఇవ్వనందుకా..?, ముస్లిం యువతకు స్వయం ఉపాధి రుణాలు ఇవ్వనందుకా..?... వైసీపీ ప్రభుత్వం ఏమిచ్చిందని మా ఇళ్లకు వస్తారు' అంటూ పోస్టర్లను అంటించారు.
ఈ పోస్టర్లను చూసిన వైసీపీ నేతలు ఇతర అధికారులు కంగుతిన్నారు. వెంటనే పోలీసులను పంపించి ఆ పోస్టర్లను తొలగింపజేశారు. ఇదే క్రమంలో భారీ స్థాయిలో పోలీసులు ముస్లిం బజార్లలో కవాతు నిర్వహించారు. భారీ బందోబస్తు నడుమ ఎమ్మెల్యే గడపగడపకు కార్యక్రమాన్ని కొనసాగించారు. గురజాల 10, 11 వార్డుల్లో ఎమ్మెల్యే వంద మంది పోలీసు బందోబస్తు మధ్య గడపగడపకు వెళ్లారు. తాను బతికుండగానే చనిపోయినట్లు చూపి ప్రభుత్వ పథకాలను నిలిపివేశారని ఓ మహిళ నిలదీశారు. ఏవేవో సాకులు చూపుతూ ఎమ్మెల్యే ముందుకు సాగారు.