ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Ambati Rambabu: "ఖరీఫ్​ సీజన్‌కు జూన్ 10 నుంచే సాగునీరు అందిస్తాం"

By

Published : May 18, 2022, 8:39 AM IST

Minister Ambati Rambabu: ఖరీఫ్​ సీజన్‌కు జూన్ 10 నుంచే సాగునీరు అందించనున్నట్లు జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. అందులో భాగంగానే పులిచింతలలో ఉన్న నీటిని దిగువకు విడుదల చేయనున్నట్లు వివరించారు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభానుతో కలిసి ఆయన పులిచింతల ప్రాజెక్ట్‌ను సందర్శించారు.

Minister Ambati Rambabu
మంత్రి అంబటి రాంబాబు

Minister Ambati Rambabu: రాష్ట్రంలో అన్ని జలాశయాల్లో తగిన నీరు ఉన్నందున ముందస్తు సాగుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలంలోని పులిచింతల ప్రాజెక్టును సందర్శించారు. ప్రోజెక్టు మొత్తాన్ని పరిశీలించారు. జలాశయం పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇటీవల కొట్టుకుపోయిన 16వ నంబరు గేటును, ప్రస్తుతం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన స్టాప్ లాక్​గేట్​ను పరిశీలించారు. త్వరలోనే నిపుణులు కమిటీ పర్యటించి గేట్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులకు అందించేందుకు ఇప్పటికే విత్తనాలు సిద్ధం చేశామన్నారు. అధికారులకు పలు సూచనలు చేశారు.

మంత్రి అంబటి రాంబాబు

ABOUT THE AUTHOR

...view details