Solar powered bike: ఎండ తగలకుండా.. వానకు తడవకుండా.. గొడుగు మాదిరి రక్షణ ఇచ్చేలా గమ్మత్తుగా ఉంది కదా ఈ వాహనం. పెట్రోల్ లేకుండానే ప్రయాణించవచ్చంటే ఆశ్చర్యంగా ఉంది కదూ.. కానీ ఇదే నిజమే.. ఉదయం సోలార్ పవర్ సాయంతో.. రాత్రి పూట బ్యాటరీ సాయంతో.. నడిచే ఈ బైక్‌ను ఏ శాస్త్రవేత్తో తయారు చేశారనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఈ అద్భుతాన్ని ఆవిష్కరించింది ఓ సాధారణ మెకానిక్.
ఈయన పేరు షేక్ మస్తాన్ వలీ. స్వస్థలం పల్నాడు జిల్లా పిడుగురాళ్ల . వాహనాల మరమ్మతులు, వైండింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. అందరూ ఆశ్చర్యపోయేలా.. సోలార్, బ్యాటరీ హైబ్రిడ్ బైక్‌ను రూపొందించి శభాష్ అనిపించుకున్నారు. అసలు ఎందుకీ ఆలోచన వచ్చిందో తెలుసా.