ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

న్యాయం జరగలేదని.. మంత్రి కార్యాలయం ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం - చిలకలూరిపేట

SUICIDE ATTEMPT AT MINISTER OFFICE : తనకు న్యాయం జరగలేదంటూ మంత్రి విడదల రజని కార్యాలయం వద్ద ఓ కల్లు గీత కార్మికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తనతో తెచ్చుకున్న పురుగుల మందు తాగి రహదారిపై కుప్పకూలాడు. గమనించిన స్థానికులు అతడిని చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

SUICIDE ATTEMPT AT MINISTER OFFICE
SUICIDE ATTEMPT AT MINISTER OFFICE

By

Published : Sep 2, 2022, 10:08 PM IST

SUICIDE ATTEMPT : పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మంత్రి విడదల రజిని కార్యాలయం వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించటం కలకలం రేపింది. బాధితుడు పట్టణ శివారు గ్రామమైన మానకొండవారిపాలెంకు చెందిన కల్లుగీత కార్మికుడు వెంకటేశ్వర్లుగా గుర్తించారు. మధ్యాహ్నం మంత్రి కార్యాలయం వద్దకు వచ్చిన వెంకటేశ్వర్లు.. తనకు న్యాయం జరగలేదంటూ పురుగుల మందు తాగారు. కాసేపటికే రహదారిపై కుప్పకూలి పడిపోగా.. వెంటనే చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు.

న్యాయం జరగలేదని మంత్రి కార్యాలయం వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ABOUT THE AUTHOR

...view details