Road Accident: పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో విప్పర్ల అంకమ్మ అనే వ్యక్తి మృతి చెందాడు. నాదెండ్ల ఎస్సై ఆవుల భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం లింగారావుపాలెం గ్రామంలోని ఓ స్పిన్నింగ్ మిల్లులో సెక్యూరిటీగార్డుగా విధులు నిర్వహిస్తున్న విప్పర్ల అంకమ్మ అలియాస్ దావీదు.. విధులు ముగించుకుని తన ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరాడు.
కడప ఆర్డీవో కారు ఢీకొని వ్యక్తి మృతి..పోలీసుల అదుపులో డ్రైవర్ - road accident at ganapavaram
Accident: పల్నాడు జిల్లాలో స్పిన్నింగ్ మిల్లులో సెక్యూరిటీ గార్డుగా విప్పర్ల అంకమ్మ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. ఎప్పటి లాగానే పని ముగించుకుని తనకున్న ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరాడు. ఇంటికి తిరిగి వచ్చే సమయంలో మధ్యలో జాతీయ రాహదారిని దాటుతున్నాడు. ఈ క్రమంలో రహదారిపై వస్తున్న కారు అంకమ్మను ఢీకొట్టింది. అంతలోనే..
మార్గమధ్యలో సర్వీసు రోడ్డు నుంచి జాతీయ రాహదారిని దాటుతుండగా.. గుంటూరు వైపు నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న కడప రెవెన్యూ డివిజనల్ అధికారి కారు.. అంకమ్మ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కారును స్వాధీనం చేసుకుని.. ప్రమాద సమయంలో కారు నడుపుతున్న డ్రైవర్ బూక్యా పురుషోత్తం నాయుడును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇవీ చదవండి: