Macharla violence has no political dimension: మాచర్లలో జరిగిన గొడవలకు ఫ్యాక్షన్ మూలాలే కారణమని పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి అన్నారు. నరసరావుపేట లోని ఎస్పీ కార్యాలయంలో.. నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మాచర్లలో జరిగిన గొడవలు కొంతమంది రాజకీయ నాయకులు రెచ్చగొట్టే చర్యలు చేశారని ఎస్పీ తెలిపారు. ఇరువర్గాలకు సంబంధించిన ఫుటేజ్ పరిశీలిస్తున్నామని వెల్లడించారు. పోలీసుల వైఫల్యం ఎక్కడా కనిపించలేదని వివరించారు. బాధితులు ఎవరూ ఫిర్యాదు చేయలేదని తెలిపారు. దౌర్జన్యం చేసినవాళ్లు ఏ ఒక్కరూ కనపించలేని పునరుద్ఘాటించారు. దాడుల్లో ఎవరెవరు పాల్గొన్నారో పరిశీలిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం చుట్టు పక్కల గ్రామాలలో.. వివిధ హత్యకేసులో ఉన్న ముద్దాయిలే మాచర్లకి వచ్చి ఉంటున్నారని అన్నారు.
శుక్రవారం ఉదయం మాచర్ల పట్టణంలో కార్డన్ సెర్చ్ నిర్వహించిన నేపథ్యంలో ఎలాంటి మారాణాయుధాలు దొరకలేదని తెలిపారు. అయినా గొడవలకు కారణమైన వ్యక్తులను మాత్రం గుర్తించామని వివరించారు. టీడీపీ నిర్వహించే ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో కొందరు వ్యక్తులు రెచ్చ గొట్టే వ్యాఖ్యలు చేయడంతో గొడవ మొదలైందన్నారు. జరిగిన ఘటనలో గుర్తుతెలియని కొందరు వ్యక్తులు రాళ్ల దాడి చేయడంతో గొడవ ముదిరిందని వివరించారు. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు ప్రతి దాడి చేసుకున్నారన్నారు.