నరసరావుపేటలో కిడ్నాప్ కలకలం.. రంగంలోకి పోలీసులు - Kalyan Jewelers employee kidnapped at palnadu

22:08 April 22
కల్యాణ్ జ్యువెలర్స్ ఉద్యోగి రామాంజనేయులు కిడ్నాప్
Narasaraopet Kidnap Case: పల్నాడు జిల్లా నరసరావుపేటలో కిడ్నాప్ కలకలం రేగింది. స్థానిక జ్యువెలరీ షాపులో పనిచేసే రామాంజనేయులు అపహరణకు గురయ్యాడు. జంగం బాజి అనే వ్యక్తి మరికొందరు షాపులోనికి వచ్చి తన భర్తను అపహరించారని రామాంజనేయులు భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నరసరావుపేట ఒకటో పట్టణ పోలీసులు.. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. అసలు.. ఈ రామాంజనేయులు ఎవరూ..? ఎందుకు కిడ్నాప్ చేశారు? అనే విషయాలు తెలుసుకునే పని పడ్డారు పోలీసులు.
ఇదీ చదవండి:విద్యార్థిని గొంతుకోసిన ఉన్మాది అరెస్టు..