ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భోగి వేడుకల్లో స్టెప్పులేసిన మంత్రి అంబటి రాంబాబు - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు

Minister Ambati Rambabu Dance: మంత్రి అంబటి రాంబాబు తన నియోజకవర్గంలోని సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. సత్తెనపల్లిలో కార్యకర్తలతో కలిసి భోగి వేడుకలను నిర్వహించారు. అనంతరం సినిమా పాటలకు స్టెప్పులు వేశారు.

అంబటి రాంబాబు
అంబటి రాంబాబు

By

Published : Jan 14, 2023, 11:01 AM IST

Minister Ambati Rambabu Dance: అంబటి రాంబాబు.. ఈ పేరు గత కొన్ని రోజులుగా వార్తల్లో మారుమ్రోగుతోంది. సంక్రాంతి పండుగకు లాటరీ టికెట్ల పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించి.. ప్రజలను మోసం చేశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు సైతం నెలకొన్నాయి. అయితే ఇదంతా నియోజకవర్గ ప్రజల సంతోషం కోసం సరదాగా చేపట్టినట్లు మంత్రి వివరణ ఇచ్చుకున్నారు. తాజాగా భోగి వేడుకల్లో పాల్గొన్న రాంబాబు.. గిరిజనులతో కలిసి స్టెప్పులేశారు.

భోగి వేడుకల్లో స్టెప్పులేసిన మంత్రి అంబటి రాంబాబు

జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. సంక్రాంతి సంబరాల్లో పాల్గొని డ్యాన్స్ చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ కేంద్రంలో జరిగిన భోగి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. భోగి మంటల ప్రాధాన్యం గురించి తనదైన శైలిలో ప్రవచించారు. నేను చలి కాచుకోవటానికి రాలేదని.. స్టెప్పులు వేసేందుకు వచ్చానన్నారు. మంచి ఫాస్ట్ బీటున్న పాట పెట్టాలని మంత్రి ఆదేశించారు. అనంతరం గిరిజన మహిళలతో కలిసి సినిమా పాటలకు స్టెప్పులు వేస్తూ భోగి మంటల చుట్టూ తిరిగారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details