ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Illegal Soil Mining: రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా.. గుల్లవుతున్న వెంకన్న కొండ - ap news

Mining Mafia in Vaikunthapuram Venkanna Hill: పల్నాడు జిల్లాలో భక్తులు కొంగు బంగారంగా కొలుచుకునే వెంకన్న కొండను అక్రమార్కులు తొలచి వేస్తున్నారు. కృష్ణమ వరద నుంచి వందలాది గ్రామాలను కాపాడే వరప్రదాయినిగా ఉన్న వైకుంఠపురం కొండకు మైనింగ్ మాఫియా ఎసరుపెట్టింది. అధికారం మాది.. అడిగేవారు లేరనుకున్నారేమో గానీ.. అడ్డగోలుగా కొండను తవ్వి గ్రావెల్ తరలిస్తున్నారు. పవిత్రమైన కొండను తమ అక్రమార్జన కోసం ప్రొక్లెయినర్లతో తవ్వుతున్నా అధికారులు నిలువరించే ప్రయత్నం చేయటం లేదు. అక్రమార్కులకు అధికార బలం తోడవటంతో భక్తులు ఏమీ చేయలేక తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Illegal Soil Mining in Vykuntapuram
వైకుంఠపురంలో అక్రమ మట్టి తవ్వకాలు

By

Published : Jul 24, 2023, 7:31 PM IST

ఇసుకాసురుల దాహానికి గుల్లవుతోన్న చారిత్రక కొండ

Illegal Soil Mining in Vykuntapuram : అడిగేవారు లేరని.. అధికారమే అండగా ఇసుకాసురుల దాహానికి చారిత్రక ప్రాధాన్యం ఉన్న కొండ గుల్లవుతోంది. పల్నాడు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురం కొండ కాస్తా.. మట్టి తవ్వకాలతో కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది. దీంతో వందల గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం పొంచి ఉందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పవిత్రమైన ప్రాంతంలో రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా :పల్నాడు జిల్లాలో భక్తులు కొంగు బంగారంగా కొలుచుకునే అమరావతి మండలంలోని వైకుంఠపురం వెంకన్న కొండను అక్రమార్కులు తొలచి వేస్తున్నారు. కృష్ణా నదిలో ఇసుక తరలించడానికి బాటల కోసం కొండను తవ్వి.. రాళ్లు, మట్టి తరలిస్తున్నారు. ఇసుక రీచ్‌లకు దారి వేయటం కోసం గ్రావెల్ బయట కొనుగోలు చేయాలంటే లారీ సుమారు 15 వేల రూపాయలు అవుతుంది. దాన్ని బయట కొనటం ఎందుకనుకున్న అక్రమార్కులు ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా కొండను తవ్వుతున్నారు. నదీ గర్భంలో ఇసుక తవ్వటమే నిబంధనలు విరుద్ధమైన కొండ తవ్వి వేల ట్రక్కుల మట్టిని తరలించడంతో కొండ చిన్నబోయింది. పవిత్రమైన ప్రాంతాన్ని మైనింగ్ మాఫియా కొల్లగొడుతున్న అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నారు.

బీజేపీ నేతల ఆగ్రహం : కొండకు పశ్చిమ దిక్కులో 100 అడుగులు లోతు, 500 అడుగుల మేర వెడల్పులో యంత్రాలతో తవ్వకాలు జరుపుతున్నారు. రాత్రి సమయాల్లోనే తవ్వకాలు జరిపి నిత్యం వందలాది టిప్పులు గ్రావెల్ ను కృష్ణా నదిలోని ఇసుక రీచ్‌కు తరలిస్తున్నారు. వైఎస్సార్సీపీ నాయకులు ఆధ్యాత్మిక ప్రదేశాల్ని సైతం నాశనం చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడ్డారు.

"వైసీపీ నాయకులు అరాచకాలు చేస్తూ రెచ్చిపోతున్నారు. ఇష్టమొచ్చినట్లుగా స్వామివారి కొండను తవ్వేస్తున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. హిందూ దేవాలయాల పవిత్రతను వారు పట్టించుకోవడం లేదు. వైసీపీ నాయకులకు అధికారులు కూడా అండగా ఉంటున్నారు. అక్కడికి వెళ్లి పరిస్థితిని పర్యవేక్షించడం లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం." -యామిని, బీజేపీ మహిళా నాయకురాలు

తప్పులను ప్రశ్నిస్తే.. అక్రమ కేసులు :కృష్ణా నదికి వరదలు వచ్చే సమయంలో ఈ కొండ అండగా నిలబడుతుంది. నదీకి అడ్డుగోడలా నిలిచి వరద నుంచి రాజధాని ప్రాంతంతో పాటు సమీపంలోని వందలాది గ్రామాలను ఈ కొండ కాపాడుతుంది. అటువంటి కొండను అక్రమంగా తవ్వుతూ బలహీన పరచడంతో భవిష్యత్తు గురించి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తవ్వకాలను అడ్డుకోవాలని చూస్తే కేసులు బనాయిస్తున్నారని గ్రామస్థులు వాపోతున్నారు.

వెల్లువెత్తుతున్న విమర్శలు :గ్రామస్థులు కొండవైపు వెళ్లేందుకు వీలు లేకుండా ఇసుకను డంపింగ్‌ చేశారు. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే కొండను సైతం అక్రమంగా తవ్వుతూ మట్టి తరలించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details