New Born Baby Finger: బొడ్డు కోయబోయి బిడ్డ వేలు కోసిన ఘటన పల్నాడు జిల్లా మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్వరూప అనే మహిళ గత నెల 30న ఆస్పత్రిలో బాబుకు జన్మనిచ్చింది. అమె స్పృహలోకి రాక ముందే పట్టిన బాబుకు బొడ్డు తాడు కోసే క్రమంలో సిబ్బంది పసికందు కుడి చేతి చిటికెన వేలు కోసేశారు. వెంటనే ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా శస్త్ర చికిత్స చేసి వేలు అతికిస్తామని వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే కారకురాలైన పారిశుద్ధ్య కార్మికురాలిని విధులు నుంచి తొలగించామని వైద్య విధాన పరిషత్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బీవీ రంగారావు ఆదేశించారు. ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు.
ప్రసవానంతరం తల్లి బిడ్డ ఇద్దరూ సేఫ్.. కానీ, సిబ్బంది చేసిన పనే.. - సమగ్ర విచారణ
New Born Baby: పురిటి నొప్పులతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ఓ మహిళ బాబుకు జన్మనిచ్చింది. ప్రసవానంతరం పుట్టిన పసికందు మహిళ ఇద్దరు సురక్షితంగానే ఉన్న.. ఆసుపత్రిలో సిబ్బంది చేసిన పనికి ఆ మహిళ కుటుంబ సభ్యులు అయోమాయానికి గురయ్యారు.
మాచర్ల ప్రభుత్వాస్పత్రి