Grand welcome to Pawan: పల్నాడు జిల్లాలో ఆదివారం జనసేన కౌలురైతు భరోసా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. మేడి కొండూరు మండలం పేరేచర్ల జంక్షన్లో, కొర్రపాడులో దారిపొడవునా జన సైనికులు స్వాగతం పలికారు. అక్కడ పవన్‌ను గజమాలతో సత్కరించారు. పవన్ కల్యాణ్‌ను చూసేందుకు మహిళలు, యువత పెద్ద సంఖ్యలో తరలిరాగా అభిమానులకు నమస్కారం చేస్తూ పవన్ ముందుకు సాగారు.
పల్నాడులో జనసేన కౌలురైతు భరోసా కార్యక్రమం.. పవన్‌కు ఘన స్వాగతం - జనసేన అధినేత పవన్ కల్యాణ్
Grand welcome to Pawan: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. జనసేన చేపట్టిన కౌలు రైతు భరోసా కార్యక్రమానికి పవన్ కల్యాణ్ హాజరు కానున్నారు. అయితే దీనికి ముందుగా దారిలో కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పవన్‌కు ఘన స్వాగతం పలికారు. ఇందులో భాగంగానే పవన్ సమక్షంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వైసీపీ నేతలు జనసేనలో చేరారు.
జనసేనలో వైసీపీ నేతలు చేరిక :తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వైసీపీ నేతలు జనసేనలో చేరారు. రాజోలు నియోకవర్గానికి చెందిన బొంతు రాజేశ్వరరావు తన అనుచరులతో కలసి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. బొంతు రాజేశ్వరరావు గత ఎన్నికల్లో రాజోలు నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ఓటమి చెందారు. పి.గన్నవరం నియోజకవర్గం నగరం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొమ్మూరు కొండలరావు, విజయనగరం జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త గురాన అయ్యు కూడా జనసేనలో చేరారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఈ సందర్భంగా పవన్ వారికి సూచించారు.
ఇవీ చదవండి: