ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పల్నాడు జిల్లాలో దారుణం.. ఐదేళ్ల కూతురిపై తండ్రి అఘాయిత్యం! - పల్నాడు జిల్లా లేటెస్ట్ అప్​డేట్స్

Father rapes five-year-old daughter
ఐదేళ్ల కూతురిపై అఘాయిత్యానికి పాల్పడిన తండ్రి

By

Published : Apr 25, 2022, 2:19 PM IST

Updated : Apr 25, 2022, 3:55 PM IST

14:14 April 25

భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య

బాసటగా నిలవాల్సినవాడే బంగారు తల్లి జీవితాన్ని నాశనం చేశాడు.. మానవ మృగాల నుంచి రక్షించాల్సినవాడే రాక్షసుడిగా మారాడు.. కన్న బిడ్డను కాపాడాల్సినవాడే కాలసర్పంగా మారాడు.. వావివరసలు మరిచి కన్న కూతురిపైనే ఘోరానికి పాల్పడ్డాడు..! అభం శుభం తెలియని ఐదేళ్ల బాలికపై.. కన్నవాడే అఘాయిత్యానికి పాల్పడిన ఘటన పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...

బొప్పూడి గ్రామానికి చెందిన నూర్ భాషా ఆదం షఫీకి 2016లో నాదెండ్ల మండలం అమీన్ సాహెబ్ పాలెేనికి చెందిన హుస్సేన్ బీతో వివాహం జరిగింది. వీరికి ఒక పాప, బాబు ఉన్నారు. పాపకు ఐదేళ్లు. ఆదం షఫీ బొప్పూడిలో ఉంటూ చిలకలూరిపేటలోని కళామందిర్ సెంటర్ వద్ద ఉన్న తినుబండారాల దుకాణంలో పని చేస్తున్నాడు. కుమార్తె ఓ పాఠశాలలో చదువుకుంటోంది. స్కూల్​కు వెళ్లే సమయంలో చిన్నారికి తల్లి స్నానం చేసేటప్పుడు తనకి నొప్పిగా ఉంటుందని.. రాత్రిపూట నాన్న పక్కన పడుకోపెట్టవద్దని ఏడుస్తూ చెప్పింది. సరేనంటూ తల్లి ఓదార్చింది. ప్రతిరోజు రాత్రి సమయంలో కుమారుడు తల్లి పక్కన, కూతురు తండ్రి పక్కన నిద్రపోతుంటారు.

చిన్నారి చెప్పిన విషయంతో తల్లి హుస్సేన్ బీ ఆలోచనలో పడింది. భర్త ఇలాంటి దుర్మార్గానికి పాల్పడతాడా..? అనే సందేహం కూడా ఆమెకు వచ్చింది. గత వారం రోజులుగా పలుమార్లు కూతురు చెప్పిన విషయాన్నే చెప్పడంతో భర్తను అనుమానించింది. ఆదివారం రాత్రి భోజనం చేసి నలుగురు పడుకున్నారు. అంతలోనే భర్త తను బయటికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లి 11 గంటలకు ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో హుస్సేన్ బీ నిద్రపోతున్నట్లు నటిస్తూ భర్త చేసే పనులు గమనించింది. భార్య నిద్ర పోతుందా లేదా..? అని సెల్​ఫోన్ లైట్ వేసి చూశాడు. నిద్రపోతోందని గుర్తించి వెంటనే దారుణానికి సిద్ధమయ్యాడు.

కుమార్తె పక్కన పడుకుని సెల్​ఫోన్​ ఆన్ చేశాడు. అందులో నీలిచిత్రాలు చూస్తూ నిద్రిస్తున్న కన్న కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గమనించిన భార్య హుస్సేన్ బీ వెంటనే భర్తను పట్టుకుంది. ఇంత దారుణానికి ఒడిగట్టిన తన భర్తలాంటి దుర్మార్గులు భూమి మీద ఉండకూడదని రోదించింది. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. చిలకలూరిపేట గ్రామీణ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. చిన్నారిని వైద్య పరీక్షల కోసం చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇలాంటి దారుణ సంఘటనలు మరొకరికి జరగకుండా తన భర్త లాంటి కసాయి వ్యక్తులను భూమి మీద లేకుండా చేయాలని కోరింది. పోలీసులు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకుంది.



ఇదీ చదవండి: దారుణం.. బ్లేడుతో భర్త గొంతు కోసిన భార్య

Last Updated : Apr 25, 2022, 3:55 PM IST

ABOUT THE AUTHOR

...view details