Farmers: పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం వద్ద.... చిలకలూరిపేట బైపాస్ రోడ్డు నిర్మాణ పనులను రైతులు అడ్డుకున్నారు. చిలకలూరిపేట మండలం రామచంద్రాపురం అడ్డరోడ్డు నుంచి యడ్లపాడు మండలం తిమ్మాపురం వరకు బైపాస్ నిర్మిస్తున్నారు. ఈ మార్గంలో గణపవరం వద్ద అప్పాపురం మార్గంలో అండర్ పాస్ వేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పొలాలకు రాకపోకలు సాగించేటప్పుడు అండర్ పాస్ లేక.. చుట్టూ తిరిగి రావాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తంచేశారు. జాతీయ రహదారుల సంస్థ అధికారులు తమ సమస్యను గుర్తించి.. అండర్ పాస్ నిర్మాణానికి తగిన చర్యలు తీసుకోవాలని విన్నవించారు.
Farmers: చిలకలూరిపేట బైపాస్ రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకున్న రైతులు.. - పల్నాడు జిల్లా తాజా వార్తలు
Farmers: పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం వద్ద చిలకలూరిపేట బైపాస్ రోడ్డు నిర్మాణ పనులను రైతులు అడ్డుకున్నారు. గణపవరం వద్ద అప్పాపురం మార్గంలో అండర్ పాస్ వేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
చిలకలూరిపేట బైపాస్ రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకున్న రైతులు