FARMER WITH PLACARD: ‘సీఎం సార్.. న్యాయం చేయాలి.. రైతు భరోసా కేంద్రం (ఆర్‌బీకే) అద్దె చెల్లించాలి’ అని రాసి ఉన్న ప్లకార్డుతో పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం ఇరుకుపాలెం గ్రామానికి చెందిన బత్తుల రోశయ్య మంగళవారం సత్తెనపల్లి నుంచి గుంటూరు బయలుదేరారు. తన ఇంటిని ఆర్‌బీకే నిర్వహణకు ఇవ్వగా ఒప్పందం చేసుకున్న అధికారులు అద్దె చెల్లించడం లేదనే కారణంతో సోమవారం కేంద్రానికి తాళం వేశారు. తనకు వ్యవసాయ శాఖ నుంచి రూ.70వేలు రావాల్సి ఉందని, ఆ సొమ్ము చెల్లించి కుటుంబపోషణకు ఇబ్బంది లేకుండా చూడాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని కోరతానని ఆయన చెప్పారు. గుంటూరులో సీఎం పర్యటన సందర్భంగా ఆయన్ని కలవాలని అక్కడికి వెళ్లిన రోశయ్యకు ఆ అవకాశం దక్కలేదు.
FARMER WITH PLACARD: సీఎం సార్.. ఆర్‌బీకే అద్దె ఇప్పించండి-ప్లకార్డుతో ఇంటి యజమాని వినతి
FARMER WITH PLACARD: తన ఇంటిని ఆర్‌బీకే నిర్వహణకు ఇవ్వగా.. ఒప్పందం చేసుకున్న అధికారులు అద్దె చెల్లించడం లేదనే కారణంతో పల్నాడుకు చెందిన ఓ రైతు సోమవారం కేంద్రానికి తాళం వేశారు. తన కుటుంబపోషణకు ఇబ్బంది లేకుండా చూడాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని కోరడానికి గుంటూరు బయలుదేరారు.
సీఎం సార్.. ఆర్‌బీకే అద్దె ఇప్పించండి-ప్లకార్డుతో ఇంటి యజమాని వినతి