Double votes in Macharla Constituency for More Than 5 Thousand Voters :పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గ(Macherla Constituency) ఓటరు జాబితాలో 5 వేలకుపైగా ఓటర్లకు రెండేసి ఓట్లు ఉన్నట్లు స్పష్టమైంది. ఎన్నికల సంఘం తాజాగా రూపొందించిన జాబితాను బూత్‌ల వారీగా పరిశీలించగా అక్రమాలు కోకొల్లలుగా వెలుగు చూస్తున్నాయి. డబ్లింగ్ తొలగించాల్సి ఉండగా, బీఎల్‌వోలపై రాజకీయ ఒత్తిళ్లతో వదిలేసినట్లు తెలుస్తోంది. వేల మంది వైసీపీ సానుభూతిపరులకు రెండుచోట్లా ఓటు హక్కుఉండటం గమనార్హం. వీరంతా సాంకేతికంగా ఎక్కడా దొరకకుండా పేరు, వయసు, ఫొటోల్లో మార్పులు చేసి వేర్వేరు బూత్‌ల పరిధిలో ఓటర్లుగా చేరారు. ఈ అక్రమంలో విశ్రాంత తహసీల్దారు ఒకరు కీలకపాత్ర పోషించినట్లు సమాచారం.
Telugu Desam Party fire on stolen votes: తప్పుల తడకగా ఓటర్ల జాబితా.. భారీగా దొంగ ఓట్లు..!
Two Votes to MLA Pinnelli Ramakrishna Reddy Family: మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ( MLA Pinnelli Ramakrishna Reddy ) సోదరుడు వెంకట్రామిరెడ్డి, అతని కుటుంబసభ్యులకు వారి సొంతూరు వెల్దుర్తి మండలం కండ్లకుంటతో పాటు మాచర్ల పట్టణంలోనూ ఓటు హక్కు ఉంది. ఎమ్మెల్యే భార్య రమకు కండ్లకుంట 114వ బూత్‌లో సీరియల్ నంబర్ 69లో SKK0044859తో ఓటు ఉండగా, మాచర్లలోని 67వ బూత్ వరుస సంఖ్య 1176లో SKK0098764తో మరో ఓటు ఉంది. ఎమ్మెల్యే సోదరుడు వెంకట్రామిరెడ్డికి కండ్లకుంటలో 114వ బూత్‌లో వరుస సంఖ్య 75లో SKK1897669తో ఓటు ఉండగా, మాచర్లలోని 67వ బూత్‌లో వరుస సంఖ్య 1175లో KBB2864791తోనూ రెండో ఓటు ఉంది.ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి భార్య సోదరులు, వారి కుటుంబసభ్యులకు దుర్గి మండలం కోలగట్ల, మాచర్ల పట్టణంలో ఓట్లున్నాయి.
PRATHIDWANI: ఓటరు జాబితాపై దిల్లీకి ఫిర్యాదులు.. ఇంటింటికి ఓటరు సర్వే