పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ములకలూరు సచివాలయంలో అమ్మఒడి నిధుల స్వాహా వ్యవహారంలో 9 మంది వాలంటీర్లను, తొలగిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. 40 మంది విద్యార్థులకు సంబంధించిన నిధుల గల్లంతులో 9 మంది వాలంటీర్ల ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో అధికారులు గుర్తించారు. నిధుల గల్లంతుపై గతంలో సచివాలయ విద్యాధికారినిని కలెక్టర్ సస్పెండ్ చేశారు.
అమ్మఒడి నిధుల పక్కదారి అంశంలో.. తొమ్మిది మంది వాలంటీర్ల తొలగింపు - undefined
పల్నాడు జిల్లాలో అమ్మఒడి నిధుల పక్కదారి అంశంలో.. తొమ్మిది మంది వాలంటీర్లను విధుల నుంచి తొలగించారు. అమ్మఒడి నిధులపై విచారణ చేపట్టిన అధికార్లు నరసరావుపేట మండలం ములకలూరు సచివాలయం వాలంటీర్ల హస్తం ఉందని గుర్తించారు.దీంతో వారందరని విధుల నుండి తొలగిస్తూ పల్నాడుజిల్లా కలెక్టర్ శివశంకర్ ఆదేశాలు జారీ చేశారు.
![అమ్మఒడి నిధుల పక్కదారి అంశంలో.. తొమ్మిది మంది వాలంటీర్ల తొలగింపు aMMA](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16593519-886-16593519-1665278545486.jpg)
aMMA
TAGGED:
Actions against volunteers