Bellamkonda ZPTC Comments: పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే నంబూరి శంకర్రావుతోపాటు ప్రభుత్వంపై బెల్లంకొండ జడ్పీటీసీ గాదె వెంకటరెడ్డి అసమ్మతి గళం వినిపించారు. వైసీపీ కోసం తాను ఆస్తులు అమ్ముకుంటే.. ఇప్పుడు పార్టీకి ద్రోహం చేసిన వారిని ప్రోత్సహిస్తున్నారని వాపోయారు.
'పార్టీ కోసం ఆస్తులు అమ్ముకున్నాను.. ఇప్పుడు వారిని ప్రోత్సహిస్తున్నారు' - Disagreements in ycp
Bellamkonda ZPTC Comments: పార్టీ కోసం కష్టపడిన వారిని కాకుండా.. పార్టీకి ద్రోహం చేసిన వారిని ప్రోత్సహిస్తున్నారని వైసీపీ జెడ్పీటీసీ సభ్యుడు ఆరోపించారు. ఎమ్మెల్యేతో పాటు ప్రభుత్వంపై.. బెల్లంకొండ జడ్పీటీసీ గాదె వెంకటరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. దీంతో పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ వైసీపీలో విభేదాలు బయటపడ్డాయి.
!['పార్టీ కోసం ఆస్తులు అమ్ముకున్నాను.. ఇప్పుడు వారిని ప్రోత్సహిస్తున్నారు' Bellamkonda ZPTC](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17374566-999-17374566-1672648473432.jpg)
బెల్లంకొండ జడ్పీటీసీ గాదె వెంకటరెడ్డి
పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ వైసీపీలో విభేదాలు
"నేను పార్టీ కోసం రూ.7కోట్లు ఖర్చుపెట్టాను. బంగారం తాకట్టు పెట్టి.. యాత్ర సినిమాని వారం రోజులపాటు ఆడించాను. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా.. నేను ఖర్చు పెట్టాను. కానీ ఇప్పుడు 'పార్టీలో ఉంటే ఉండు.. పోతేపో' అన్నట్టు వ్యవహరిస్తున్నారు". -గాదె వెంకటరెడ్డి, బెల్లంకొండ జెడ్పీటీసీ సభ్యులు
ఇవీ చదవండి: