Dangerous Narasaraopet Bypass Road :నగరాలు, పట్టణాల్లోని ట్రాఫిక్‌లో, ఇరుకు సందుల్లో ప్రయాణించే కంటే బైపాస్ మార్గంలో వేగంగా వెళ్లేందుకు వాహనాదారులు ఆసక్తి చూపిస్తుంటారు. సరుకు రవాణా లారీలు, భారీ వాహనాలూ నగరంలోకి రాకుండా బై పాస్ రోడ్డులోనే వెళ్లుతుంటాయి. కానీ పల్నాడు జిల్లా నరసరావుపేట బైపాస్ మార్గంలో ప్రయాణించాలంటే మాత్రం వాహనాదారులు బెంబేలెత్తిపోతున్నారు. గుంతలు తప్ప రోడ్డు లేని ఈ దారిలోకి వస్తే బండ్లు మరమ్మతులకు, మనుషులు ఆసుపత్రులకు వెళ్లడం ఖాయమంటున్నారు.
Road Situation in YSRCP Government :రహదారిపై ద్విచక్రవాహనాలు, ఆటోలు, కార్లు, లారీలు నడపాలంటే డ్రైవింగ్ లైసెన్స్ (Driving License) ఉంటే సరిపోతుంది. జిల్లాలోని రహదారులపై ప్రయాణం సాగించాలంటే మాత్రం బండి నడిపే నైపుణ్యమే కాదు భారీ గుంతల్ని తప్పిస్తూ వాహనాన్ని అష్ట వంకరలు తిప్పే ప్రావీణ్యం కలిగి ఉండాలి. అప్పుడే నరసరావుపేట బైపాస్ మార్గంలో ప్రయాణించగలరు. లేని పక్షంలో ఈ వాహనాదారుడు ప్రమాదాల బారిన పడి చేతులు, కాళ్లు విరగొట్టుకుని ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిందని ప్రయాణికులు ఛలోక్తులు విసురుతున్నారు.
Damage roads in Guntur : రోడ్లను అభివృద్ధి చేయాలని నాట్లు వేసి మహిళల నిరసన
AP Roads At Dangerous Situation :నరసరావుపేట శివారు ఇస్సపాలెం నుంచి జొన్నలగడ్డ మీదుగా గుంటూరు రహదారి(Guntur Road)లో కలిసే బైపాస్ మార్గమిది. ఎలాంటి నిర్వహణ లేక, కనీస మరమ్మతులకు నోచుకోక గుంతలతో నరకానికి నకళ్లుగా మారిందని వాహనాదారులు వాపోతున్నారు. భారీ గోతులతో రహదారి పూర్తి అధ్వానంగా తయారైందని.. వాహనాల రాకపోకలకు ఏ మాత్రం అనువుగా లేక ప్రమాదాలకు నెలవుగా మారిందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లారీలు, పెద్ద వాహనాలు ఈ మార్గంలో వస్తే మాత్రం షెడ్డుకు వెళ్లక తప్పదని డ్రైవర్లు గగ్గోలు పెడుతున్నారు.