Danda Nagendra Granted Bail by the Sattenapalli Court: ఇసుక అక్రమ తవ్వకాలపై ఎన్‌జీటీలో కేసు వేసిన దండా నాగేంద్రకు సత్తెనపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తెలంగాణ మద్యం తరలింపు కేసులో అమరావతి పోలీసులు ఈ నెల 3న నాగేంద్రను అరెస్ట్ చేశారు. 4న రిమాండ్‌కు తరలించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాగేంద్రకుమార్ ఎన్జీటీలో ఫిర్యాదు చేశారని.. కక్షసాధింపు చర్యలకు దిగారని ఆయన తరఫు న్యాయవాదులు పూజల వెంకటకోటయ్య, కొల్లా వెంకటేశ్వరరావులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గత నెల 28 నుంచి 30 వరకు దిల్లీలో ఎన్జీటీ వద్దకునాగేంద్రకుమార్ తిరుగుతుంటే..తెలంగాణలోని మిర్యాలగూడలో గత నెల 28న మద్యం కొనుగోలు చేసి తెచ్చారని ఆయనపై అక్రమంగా కేసు నమోదు చేశారని న్యాయవాదులు వివరించారు. నాగేంద్ర తరఫు న్యాయవాది దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన సత్తెనపల్లి కోర్టు బుధవారం అతనికి బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
14 Days Remand for Danda Nagendra:14 రోజులు రిమాండ్:పల్నాడు జిల్లా ధరణికోటకు చెందిన వైసీపీ మాజీ నేత దండా నాగేంద్రను తెలంగాణ మద్యం అక్రమ రవాణా కేసులో అమరావతి పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. అదేరోజు రాత్రి సత్తెనపల్లి కోర్టులో దండా నాగేంద్ర(Danda Nagendra)ను హాజరుపరిచారు. అయితే, రిమాండ్ రిపోర్టు సరిగా లేదని న్యాయమూర్తి చెప్పటంతో.. దాన్ని సరిచేసి సోమవారం మరోసారి కోర్టులో ప్రవేశపెట్టారు. సత్తెనపల్లి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నాగేంద్రకు 14 రోజులు రిమాండ్(14 Days Remand) విధించింది. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలపై దండా నాగేంద్ర జాతీయ హరిత ట్రిబ్యునల్లో కేసులు వేశారు. తవ్వకాలు ఆపేయాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. దీంతో ప్రభుత్వం కక్ష పెంచుకుని తప్పుడు కేసులు బనాయించిందని అతని భార్య ఆరోపించారు.