Damaged Bridge at Pedamadduru Palnadu District :అమరావతి- విజయవాడ మధ్య ప్రధాన రహదారిపై (Amaravati to Vijayawada Main Road) పెదమద్దూరు వద్ద వాగుపై వంతెన తీవ్రంగా దెబ్బతింది.పాత వంతెన శిథిలావస్థకు (Bridge Dilapidated) చేరటంతో ప్రయాణికులు, వాహనదారులు కొన్నేళ్లుగా ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ఆ వంతెన ఓ వైపు కుంగిపోయింది. పది మీటర్లకు పైగా పొడవున దెబ్బతినటంతో వాహనదారులు వెళ్లటానికి ఇబ్బందులు ఏర్పడుతున్నారు. ఇప్పటికే రక్షణ గోడలు దెబ్బతినడంతో వాహనాలు నెమ్మదిగా వెళ్తున్నాయి. వంతెన నుంచి అప్రోచ్ రోడ్డు కూడా గుంతలమయంగా మారింది.
Bridge on Main Road from Amaravati to Vijayawada is Dilapidated :వంతెన కాలం తీరటంతో అక్కడ కొత్త వంతెన కోసం ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ.44 కోట్లతో వంతెనతో పాటు రహదారి నిర్మాణానికి 2022 అక్టోబర్ 27వ తేదిన శంకుస్థాపన జరిగింది. ఏడాదిలో పూర్తి చేయాలని గడువు నిర్దేశించారు. పునాదులు తవ్వటంతో పాటు కొంతమేర పిల్లర్ల నిర్మాణం కూడా జరిగింది. అయితే గుత్తేదారుకు బిల్లులు చెల్లించకపోవటంతో పనులు నత్తనడకన సాగాయి. బకాయిలు పేరుకుపోవటంతో గుత్తేదారు 2నెలల క్రితమే పనులు ఆపేశారు. సజావుగా పనులు జరిగి ఉంటే మరి కొద్ది నెలల్లో వంతెన నిర్మాణం పూర్తై ఉండేది.
Bridge Collapsed in Bapatla District: కూలిన దశాబ్దాల నాటి వంతెన.. 20 గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం
Government not Funding to Bridge at Pedamadduru :ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవటంతో గుత్తేదారులు పనులు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. కొత్త వంతెన అందుబాటులోకి రాకమునుపే.. పాత వంతెన కుంగిపోవటం ఇబ్బందిగా మారింది. ఈ మార్గంలో భారీ వాహనాలు కూడా వెళ్తుంటాయి. ముఖ్యంగా అమరావతి నుంచి ఇసుక తరలించేందుకు కూడా రహదారి వినియోగిస్తుంటారు. వంతెన సరిగా లేకపోయినా భారీ వాహనాల రాకపోకల్ని అలాగే కొనసాగిస్తున్నారు. దీంతో వంతెన ఇప్పుడు కుంగిపోయిందని వాహనదారులు చెబుతున్నారు. ఇప్పటికైనా భారీ వాహనాలు ఆపాలని కోరుతున్నారు. అదే సమయంలో కొత్త వంతెన పనులు తిరిగి ప్రారంభించి త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.