CM Jagan to lay foundation stone for Varikapudisela project:సీఎం జగన్ పల్నాడు జిల్లా మాచర్లలో వరికపూడిశెల ఎత్తిపోతల ప్రాజెక్టుకు బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 9.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి...తాడేపల్లి హెలిఫ్యాడ్ వద్దకు చేరుకుంటారు. 9.55 గంటలకు హెలికాఫ్టర్ లో మాచర్ల పయనమవుతారు. 10.35 గంటలకు సెయింట్స్ ఆన్స్ హైస్కూల్ మైదానంలో ఏర్పాటు చేసిన హెలిఫ్యాడ్ వద్దకు సీఎం చేరుకుంటారు.10.40 గంటలకు ప్రజా ప్రతినిధులతో పది నిమిషాల పాటు సమావేశమవుతారు. ఆ తరువాత రోడ్డు మార్గంలో చెన్నకేశవ కాలనీకి ఎదురుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభా స్థలి వద్దకు సీఎం చేరుకుంటారు. 11 గంటల ప్రాంతంలో సభా వేదిక నుంచే వరికిపూడిశెల ప్రాజెక్టు కు శంకుస్థాపన చేస్తారు.
రాష్ట్రాన్నిఅరాచకాంధ్రప్రదేశ్‌గా మార్చిన వైసీపీ కార్యకర్తలు, నేతలు
11.35 గంటలకు బహిరంగ: వరికిపూడిశెల ప్రాజెక్టు నమునాను, ఫోటో ఎగ్జిబిషన్ ను సీఎం జగన్ పరిశీలిస్తారు. అనంతరం 11.35 గంటలకు బహిరంగ సభలో సీఎం జగన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సభ ముగిసిన అనంతరం తిరిగి రోడ్డు మార్గంలో మాచర్లలోని సెయింట్స్ ఆన్స్ హైస్కూల్ హెలిఫ్యాడ్ వద్దకు చేరుకుంటారు. 12.30 నుంచి 1.30 గంటల మధ్య స్థానిక నాయకులతో సీఎం సమావేశమవుతారు. 1.35 గంటలకు మాచర్ల నుంచి హెలికాఫ్టర్ లో బయలుదేరి తాడేపల్లికి చేరుకుంటారు.
రోజురోజుకూ పెరుగుతున్న ఆంధ్రప్రదేశ్ అప్పుల చిట్టా!
వరికెపూడిశెల ఎత్తిపోతల ప్రాజెక్టు: రాష్ట్రంలో పూర్తిగా పైపులైన్ల ద్వారా నీరందించే తొలి ప్రాజెక్ట్ వరికెపూడిశెల ఎత్తిపోతల ప్రాజెక్టు. తొలిదశలో పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలో 24900 ఎకరాలకు సాగునీరు, 20 వేల మంది జనాభాకు తాగునీరు అందించనున్నారు. రెండోదశలో పల్నాడు జిల్లాలో వెల్దుర్తి, దుర్గి, మాచర్ల, కారంపూడి, గురజాల, బొల్లాపల్లి మండలాల్లో ఆయకట్టుకు సాగునీరు లభిస్తోంది. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలోని పుల్లలచెరువు మండలంలోని ఆయకట్టుకు సాగునీరు అందిస్తారు. రెండో దశలో 1.04లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది.
మాచర్లలోని పాఠశాలలకు సెలవులు: సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో మాచర్లలోని పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. సీఎం బహిరంగ సభకు ప్రైవేట్ పాఠశాలల బస్సుల్లో జనాలను తరిలించేందుకు వైకాపా నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు పల్నాడు జిల్లా నుంచే కాక గుంటూరు, బాపట్ల జిల్లాల నుంచి సైతం ఆర్టీసీ బస్సుల్ని కేటాయించడంతో...మంగళవారమే ప్రయాణికులు బస్సులు లేక ఇబ్బందులు పడ్డారు. నరసరావుపేట, వినుకొండ పట్టణాల నుంచే కాక గుంటూరు, పొన్నూరు డిపో నుంచి సైతం బస్సుల్ని పంపించడంతో విద్యార్థులు, ఉద్యోగులు గమ్యం చేరేందుకు అవస్థలు పడ్డారు. బాపట్ల జిల్లా నుంచి సీఎం పర్యటనకు 100 బస్సులు పెట్టడంతో....ప్రయాణికులు బస్సుల కోసం బస్టాండ్ ల్లోనే పడిగాపులు కాశారు.
జగనన్న సురక్ష వైద్య శిబిరాలతో ఒరిగిందేమిటి?