నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్తత.. టీడీపీ నేత చల్లా సుబ్బారావు ఇంటిపై వైసీపీ శ్రేణుల దాడి! - నరసరావుపేటలో వైఎస్సార్సీపీ టీడీపీ కార్యకర్తల గొడవ
19:47 July 16
రాళ్లు, కర్రలతో కొట్టుకున్న వైసీపీ, వైసీపీ వర్గీయులు
TDP and YSRCP clash in Narasaraopet : పల్నాడు జిల్లా నరసరావుపేటలో వైసీపీ, టీడీపీ వర్గీయుల ఘర్షణ తలెత్తింది. రాళ్లు, కర్రలతో వైసీపీ, టీడీపీ వర్గీయులు కొట్టుకున్నారు. ఇరువర్గాలను చెదరగొట్టేందుకు పోలీసుల ప్రయత్నం చేస్తున్నారు. ఘటనాస్థలానికి వచ్చిన టీడీపీ నేత చదలవాడ అరవిందబాబు కారుపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. వైసీపీ శ్రేణుల దాడిలో అరవిందబాబు కారు డ్రైవర్‌కు గాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా చేరుకున్నారు.
టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి ఇంటిపై దాడి: టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి చల్లా సుబ్బారావు ఇంటిపై వైసీపీ శ్రేణుల దాడి చేశారు. చల్లా సుబ్బారావు ఇంటి కిటికీలు, ఫర్నిచర్‌ను వైసీపీ వర్గీయులు ధ్వంసం చేశారు. నిన్న ఎమ్మెల్యే గోపిరెడ్డిపై.. చేసిన చల్లా సుబ్బారావు అవినీతి ఆరోపణలు చేశారు. కోటప్పకొండ రోడ్డులోని ఇంటిని సుబ్బారావు ఆక్రమించారని వైసీపీ వర్గీయుల ఆరోపిస్తున్నారు. రాళ్లు, కర్రలతో ఇరువర్గాల పార్టీ శ్రేణులు దాడికి దిగారు. పోలీసు జీపు, టీడీపీ నేతలు కడియాల రమేశ్, అరవిందబాబు కార్లను ధ్వంసం చేశారు.