Chandrababu On Macherla Incident: మాచర్ల ఘటనపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ట్విటర్ ద్వారా స్పందించారు. వైసీపీ నాయకులపై పెట్టిన కేసులతో పాటుగా.. టీడీపీ నేతలపై పెట్టిన కేసులకు వ్యత్యాసాన్ని తెలుపుతూ... వైసీపీ నేత కత్తి పట్టిన వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఘటనపై పోలీసులు వ్యవహరించి తీరుపై వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
'కత్తి పట్టినవాడు బాధితుడూ.. దాడులకు గురైన తెలుగుదేశం వాళ్లు నిందితులా..?' - తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు ట్విట్టర్
Macherla violence: మాచర్ల వైకాపా నేత చల్లా మోహన్ కత్తిపట్టిన వీడియోపై డీజీపీ ఖాకీ డ్రెస్ సిగ్గుపడుతుందంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. వైసీపీ నాయకులపై పెట్టిన కేసులు.. టీడీపీ నేతలపై పెట్టిన కేసులకు వ్యత్యాసాన్ని తెలుపుతూ.. వైసీపీ నేత కత్తి పట్టిన వీడియోను తన ట్విటర్లో పోస్ట్ చేశారు.
Chandrababu On Macherla Incident
మాచర్ల వైకాపా నేత చల్లా మోహన్ కత్తిపట్టిన వీడియోపై డీజీపీ ఖాకీ డ్రెస్ సిగ్గుపడుతుందంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కత్తి పట్టినవాడు బాధితుడూ.., దాడులకు గురైన తెలుగుదేశం వాళ్లు నిందితులా అని మండిపడ్డారు. మాచర్లలో ఏమి జరిగిందో ఒక్క పోలీసులకు తప్ప.. నిజానిజాలు ఏంటో రాష్ట్రం మొత్తం తెలుసునని అన్నారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అని విమర్శించారు.
ఇవీ చదవండి: