chandar babu fire on Rompicharla gunfire incidence: పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం రొంపిచర్ల మండలంలోని అలవాలలో టీడీపీ మండలాధ్యక్షుడు వెన్నా బాలకోటి రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. కొంతమంది ప్రత్యర్థులు బాలకోటి రెడ్డి ఇంట్లోకి ప్రవేశించి.. గన్‌తో రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో బాలకోటి రెడ్డి తీవ్రంగా గాయపడడంతో కుటుంబ సభ్యులు హూటాహుటిన నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ క్రమంలో టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటి రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. కాల్పుల కారణంగా తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలకోటి రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆయన ఆరా తీశారు. ఆసుపత్రిలో ఉన్న పార్టీ నాయకులు, వైద్యం అందిస్తున్న డాక్టర్లతో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. ప్రస్తుతం బాలకోటి రెడ్డి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని వివరాలను తెలుకున్నారు.