Sri Chaitanya Group of Colleges Chairman BS Rao: విద్యా సంస్థల విస్తరణ కోసం కావాల్సిన భూములు, భవనాలను సేకరించి అందజేసేందుకు తమ వద్ద డబ్బు తీసుకొని లింగమనేని రమేష్ గ్రూపు కంపెనీలు మోసం చేశాయని శ్రీచైతన్య విద్యా సంస్థల ఛైర్మన్ డాక్టర్ బి.ఎస్.రావు ఆరోపించారు. నగదు చెక్కులు తీసుకుని.. ఒప్పందాలు చేసుకుని ఏ ఒక్కటీ నెరవేర్చకుండా మోసం చేసినందున లింగమనేని రమేష్ గ్రూపు కంపెనీలపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో ఐదు కేసులు దాఖలు చేసినట్లు తెలిపారు. మోసపూరిత విధానాలు అనుసరించిన లింగమనేని గ్రూపు నుంచిన కోట్లాది రూపాయలు తమకు రావాల్సి ఉందని తన న్యాయవాదులతో కలిసి బి.ఎస్.రావు మీడియా సమావేశం నిర్వహించారు తాము చెల్లించిన మొత్తాన్ని వడ్డీతో సహా వసూలు చేసేందుకు అవసరమైతే మళ్లీ సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేస్తామని బీఎస్‌రావు, అతని తరఫు న్యాయవాదులు తెలిపారు.
ప్రతి నిమిషం స్టూడెంట్ బెటర్మెంట్ కోసం ఆలోచించే నేను తిరిగి ల్యాండ్స్ కొనడం అనేది జరిగేది కాదు. వాళ్లకు వాళ్లే బ్రోకర్స్ చెపుతుంటే లింగమనేని రమేష్ అనే అతను ఆ మాట విని నా దగ్గరకు వచ్చారు. కొంత అడ్వాన్స్ ఇవ్వండి నేను కొని పెడతాను. వాళ్ల అమ్మగారిది మా స్వగ్రామమే ఆ నమ్మకంతోనే 2,3 ఇయర్స్లోనే 310 కోట్లు ఇచ్చాను. -బి.ఎస్.రావు, ఛైర్మన్ శ్రీచైతన్య విద్యా సంస్థలు