మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు.. ఎందుకో తెలుసా..? - నేటి వార్తలు
15:39 January 18
కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు
AP Minister Ambati Rambabu: జల వనరులశాఖ మంత్రి అంబటి రాంబాబుపై పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణ పోలీసు స్టేషన్‌లో ఈ నెల 16న కేసు నమోదైంది. నిషేధిత లాటరీ చట్టాన్ని ఉల్లంఘించి వైఎస్‌ఆర్ సంక్రాంతి లక్కీ డ్రా పేరిట వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, వైకాపా శ్రేణులతో ఆయన పెద్ద ఎత్తున లాటరీ టికెట్లను అమ్మిస్తూ ప్రజల్ని మోసగిస్తున్నారని జనసేన ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గుంటూరు ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి విచారణ జరిపి.. సమగ్ర దర్యాప్తు చేసి ఫిబ్రవరి 21న కోర్టుకు నివేదిక అందించాలని సత్తెనపల్లి పోలీసుల్ని ఆదేశించారు. కోర్టు ఆదేశాలతో మంత్రి అంబటి రాంబాబుపై సత్తెనపల్లి పోలీసులు సెక్షన్-5 ప్రైజ్ చిట్స్ నగదు బదిలీ చట్టం (బ్యానింగ్)-1978 కింద కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్ కింద అభియోగాలు రుజువైతే రెండేళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది. లాటరీపై దర్యాప్తునకు ఈ నెల 11న జడ్జి ఆదేశాలు జారీ చేయగా మరుసటి రోజు (12వ తేదీ) రాత్రి సత్తెనపల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ సుగాలీ ఉన్నత పాఠశాలలో... మంత్రి రాంబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో లక్కీ డ్రా నిర్వహించారు.
ఇవీ చదవండి: