ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పల్నాడు జిల్లాలో బస్సు ప్రమాదం... నలుగురికి గాయాలు - పల్నాడు జిల్లాలో బస్సు ప్రమాదం

Bus Accident: పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం తాతపూడి పరిధిలో మంగళవారం తెల్లవారుజామున ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Bus Accident
Bus Accident

By

Published : Nov 22, 2022, 12:24 PM IST

పల్నాడు జిల్లాలో బస్సు ప్రమాదం

Bus Accident: పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం తాతపూడి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కడప నుంచి విజయవాడకు వస్తున్న వీఆర్​సీఆర్ ట్రావెల్‌కు చెందిన బస్సు టిప్పర్‌ను ఢీ కొట్టింది. ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన బస్సులో 40మంది ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో బస్సులో నిద్రిస్తున్న కడపకు చెందిన బస్సు రెండో డ్రైవర్ బాబు పీరా (25), క్లీనర్ రామస్వామి (45), రాయచోటి మాధవ వరంకు చెందిన రమణమ్మ (49), బాబు(27) లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details