ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రియురాలిని హత్య చేశాను.. ప్రేమికుడు పోలీసులకు ఫిర్యాదు.. కానీ - rompicharla lover Murder Case

Lover Played Murder Drama ప్రియుడి చేతిలో ప్రియురాలు హత్యకు గురైందన్న సంఘటన పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలంలో ఒక్కసారిగా కలకలం రేపింది. ప్రియురాలు హత్యకు గురైందని పోలీసులకు ఫిర్యాదు అందింది. అది నిజమని నమ్మిన పోలీసులు ఆదివారం రాత్రి అనుమానం ఉన్న ప్రతి చోట గాలించారు. చివరికి పోలీసులు ప్రియుడ్ని విచారించగా ఆమె బతికే ఉందని తేలింది. ఇంతకి ఏం జరిగిందంటే..

Lover Murder
ప్రియురాలి హత్య

By

Published : Dec 5, 2022, 2:53 PM IST

Lover Played Murder Drama ప్రియురాలు పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయటంతో తానే చంపినట్లు ప్రియుడు పోలీసులకు తెలిపాడు. హత్య చేసి మృతదేహాన్ని ఓ తోటలో పడేశానని తెలపటంతో పోలీసులు గాలించారు. ఎంత వెతికినా మృతదేహం లభించకపోవటంతో ప్రియుడిపైనే అనుమానం వచ్చి పోలీసులు తమదైన శైలిలో అతనిని విచారించగా.. మొదట కిడ్నాప్​నకు గురైందని నాటకమాడాడు. తర్వాత ఆమె బతికే ఉందని తెలిపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా ఈపూరు మండలానికి చెందిన పాపారావు, శారదలు ప్రేమించుకున్నారు. ప్రియురాలు శారద పెళ్లి చేసుకోమని అతని మీద ఒత్తిడి తీసుకువచ్చేది. ఎప్పటిలాగానే ఆదివారం కూడా అడగటంతో వారిద్దరీ మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో అమె అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయింది.

అంతలోనే తన ప్రియురాలు హత్యకు గురైందని అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హత్య చేసి సమీపంలో సుబాబుల్​ తోటలో పడేశానని పోలీసులకు తెలిపాడు. పోలీసులు రాత్రాంతా సుబాబుల్​ తోటలో గాలించారు. చివరకు అతని మీదే అనుమానంతో.. పోలీసులు అతనిని విచారించారు. మొదట కిడ్నాప్​న​కు గురైందని నాటకమాడాడు. ఆ తర్వాత తన ప్రియురాలు బతికే ఉందని తెలిపాడు. ప్రియురాలు బంధువుల ఇంట్లో ఉందని పోలీసుల విచారణలో తేలింది. అతడు పోలీసులకు ఫిర్యాదు చేయటానికి గల ఉద్దేశం ఎంటనేది తెలియరాలేదు. ప్రియురాలిని విచారించిన తర్వాత పూర్తి విషయం బయటకు వస్తుందని పోలీసులు తెలిపారు. పోలీసులు ప్రియుడు, ప్రియురాలు ఇద్దరిపైనా కేసు నమోదు చేశారు.

ప్రియురాలిని హత్య చేశానని ప్రియుడి నాటకం

ఇవీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details