ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వినుకొండ జీడీసీసీలో అక్రమాలు.. మేనేజర్​ సహా మరో ఉద్యోగిపై చర్యలు.. - పల్నాడు తాజా వార్తలు

Bank scam: పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలంలోని వినుకొండ జీడీసీసీ బ్యాంకులో అక్రమాలు జరిగాయి. బ్యాంక్ మేనేజర్​తో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కలిసి మండలంలోని సరికొండాయపాలెం తండాకు చెందిన 22 మహిళా పొదుపు సంఘాల సొమ్మును గోల్​మాల్​ చేసినట్లు పలువురు మహిళలు ఆరోపిస్తున్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి తమకు న్యాయం చేయాలని, తాము కట్టిన పొదుపు డబ్బు తమ ఖాతాల్లో జమ చేయాలని కోరుతున్నారు.

bank scam
బ్యాంక్ స్కామ్

By

Published : Nov 5, 2022, 5:29 PM IST

మాట్లాడుతన్న పొదుపు సంఘాల మహిళలు

Bank scam: పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలంలోని వినుకొండ జీడీసీసీ బ్యాంకులో అక్రమాలు జరిగిన నేపథ్యంలో ఆ బ్రాంచ్​ మేనేజర్​ రమేష్​బాబుతో సహా ఔట్ సోర్సింగ్ ఉద్యోగి భాస్కర్ మూర్తిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. బొల్లాపల్లి మండలం సరికొండాయపాలెం తండాకు చెందిన 22 మహిళా పొదుపు సంఘాల సొమ్మును జీడీసీసీ బ్యాంకు సిబ్బంది గోల్​మాల్​ చేశారని మహిళలు ఆరోపించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి భాస్కర్ మూర్తి, బ్యాంకు మేనేజర్ రమేష్ బాబు ఇద్దరు కలిసి తాము చెల్లించిన పొదుపు, సమైక్య, నెలవారి డ్వాక్రా రుణాల వాయిదా డబ్బులను తమ ఖాతాల్లో జమ చేయకుండా దారి మళ్ళించారని తెలిపారు.

ఈ విషయంపై బండ్లమోటు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. గతంలో జిల్లా బ్యాంక్ అధికారులు విచారణ చేసి గోల్​మాల్​ అయిన సొమ్మును భాస్కర మూర్తి దగ్గర నుంచి రికవరీ చేశారని, ఆ తర్వాత అతని విధుల నుంచి తప్పించారని తెలిపి, సరికొండాయపాలెం తండా కి వచ్చి నామమాత్రపు విచారణ చేశారని, బాధితులు మీడియా ముందు వాపోయారు.

ఎక్కువ మొత్తంలో లోన్స్ ఇప్పిస్తానని చెప్పి కెనరా బ్యాంకులో ఉన్న తమ ఖాతాలను వినుకొండ జీడీసీసీకి మార్చారని పొదుపు సంఘాల మహిళలు ఆరోపించారు. భాస్కర మూర్తి అనే ఉద్యోగి లోన్లు మంజూరు చేయించి, సగం సొమ్ము మాత్రమే తమకు చేతికి ఇచ్చారని, మిగిలిన సొమ్మును బ్యాంక్ అధికారులతో కలిసి స్వాహా చేశారని మహిళలు చెప్పారు. అయితే నెలనెలా బ్యాంక్ సిబ్బంది తమ వద్ద పొదుపు మొత్తం డబ్బులు వసూలు చేసుకున్నారని, రశీదులు కూడా పూర్తిగా ఇవ్వలేదని, బ్యాంకు ఖాతా పుస్తకంలో జమ చేయమని అడిగినా తమకు ఖాతా పుస్తకం కూడా ఇవ్వకుండా సొమ్ము స్వాహా చేశారని అన్నారు.

మహిళలు జిల్లా బ్యాంకు విచారణ అధికారుల దృష్టికి తీసుకురాగా.. ఈ నేపథ్యంలో దర్యాప్తు చేసి తమకు న్యాయం చేయాలని, తాము కట్టిన పొదుపు డబ్బు తమ ఖాతాలో జమ చేయాలని ఉన్నత అధికారులకు విన్నవించుకుంటామని చెప్పారు. దీనిపై బండ్లమోటు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని మీడియాకు తెలిపారు. వారిపై కంప్లైంట్ నమోదు చేసుకొని ప్రాథమిక దర్యాప్తు చేస్తున్నామని బండ్లమోటు ఎస్సై జె బలరామ రెడ్డి తెలియజేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details