Attack on YSRCP Youth Convenor: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు అనుచరుడు, వైకాపా యూత్ కన్వీనర్ షేక్ కరీముల్లాపై రాత్రి దాడి జరిగిన ఘటన కలకలం రేపింది. సత్తెనపల్లిలోని హోర్డింగ్‌ల నిర్వహణ విషయంలో వైకాపాలోని ఇరువర్గాలకు గత కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గత రాత్రి వైకాపా యూత్ కన్వీనర్ కరీముల్లా కళ్లలో కారం చల్లి మరో వర్గం వారు దాడి చేసినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పట్టణంలోని వేగ డిజిటల్ యాజమాన్యంపై బాధితుడు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు పోలీసులకు తెలిపాడు. బాధితుని ఫిర్యాదు మేరకు సత్తెనపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వైకాపాలో విభేదాలు.. యూత్ కన్వీనర్‌పై దాడి... ఎక్కడంటే..? - పల్నాడు జిల్లాలో వైకాపా యూత్ కన్వీనర్‌పై దాడి
Attack on YSRCP Youth Convenor: సత్తెనపల్లిలో వైకాపా వర్గీయుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైకాపా యూత్ కన్వీనర్‌పై మరో వర్గానికి చెందిన వారు దాడికి పాల్పడిన ఘటన కలకలం సృష్టించింది. కళ్లలో కారం చల్లి... మరో వర్గం దాడి చేసినట్లు పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు.
వైకాపా యూత్ కన్వీనర్‌పై దాడి