ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Attack On Woman: పల్నాడు జిల్లాలో దళిత మహిళపై దాడి.. ఎందుకంటే..!

Attack On Woman: ఎస్సీ, ఎస్టీ కేసులో రాజీకి రాలేదని దళిత మహిళపై దాడి చేసి గాయపర్చిన ఘటన పల్నాడు జిల్లాలోని సంతగుడిపాడులో చోటు చేసుకుంది. గాయపడిన ఆమెను నరసరావుపేటలోని ఏరియా వైద్యశాలకు తరలించారు.

Attack On Woman
అట్రాసిటీ కేసులో రాజీకి రాలేదని మహిళపై దాడి

By

Published : Apr 20, 2022, 12:47 PM IST

Attack On Woman: పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం సంతగుడిపాడులో ఓ మహిళపై దారుణంగా దాడి చేశారు. అట్రాసిటీ కేసులో రాజీకి రాలేదని దళిత మహిళపై అదే గ్రామానికి చెందిన మరో మహిళ తీవ్రంగా గాయపరిచింది.

అసలేం జరిగిందంటే..: 2017లో సంతగుడిపాడుకి చెందిన నామాల మంగమ్మ అనే మహిళ తన మీద దాడి చేసిందని ఆలూరి వీరమ్మ రొంపిచర్ల పోలీస్​స్టేషన్​లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేసింది. అయితే కేసు విచారణ నిమిత్తం గుంటూరు వెళ్లడానికి వీరమ్మ బస్టాండ్ వద్దకు రాగానే మంగమ్మ, ఇంకా వేరే వ్యక్తి కలిసి కత్తులు, కర్రలతో దాడి చేసినట్లు వీరమ్మ కుమారుడు తెలిపాడు. బాధితురాలిని పట్టణంలోని ఏరియా వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఆమె కొడుకు తెలిపాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీరమ్మను బీఎస్పీ జిల్లా ఇన్​ఛార్జ్ బూదాల బాబూరావు, మండల పార్టీ అధ్యక్షుడు మరియదాసులు పరామర్శించారు.

ఇదీ చదవండి:'ఆడపిల్లలకు ఆస్తిలో హక్కు లేదా.. మహిళలుగా పుట్టడం శాపమా?'

ABOUT THE AUTHOR

...view details