ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు తక్షణమే నష్టపరిహారమివ్వాలి: సోము వీర్రాజు - bjp news

BJP president Somu Veerraju latest comments: రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నష్ట పరిహారాన్ని ఇవ్వాలని.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు సంబంధించి తాజాగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి తాను లేఖ రాశానని.. అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటల వివరాలను, రైతులకు చెల్లించాల్సిన నష్టపరిహారాలను పేర్కొన్నానని తెలిపారు.

1
1

By

Published : Mar 24, 2023, 6:23 PM IST

BJP president Somu Veerraju latest comments: రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారాన్ని చెల్లించాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఈరోజు.. నిరుపేదలకు సోము వీర్రాజు, పలువురు నేతలు కలిసి ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. అనంతరం అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు సంబంధించి.. తాను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశానని.. అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటల వివరాలను, రైతులకు చెల్లించాల్సిన నష్టపరిహారాల వివరాలను పేర్కొన్నట్లు ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా మీడియా సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడుతూ.. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారాన్ని చెల్లించాలని కోరారు. రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటల వివరాలను, వాటికి చెల్లించాల్సిన నష్టపరిహారాలకు సంబంధించి.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశానని సోము వీర్రాజు తెలిపారు. రైతులు లక్షల రూపాయల అప్పులు తెచ్చి, పంటలు పండించగా.. చేతికి అందే సమయంలో అకాల వర్షాలు భారీగా కురిసి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. కాబట్టి పంట నష్టపోయిన ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సోము వీర్రాజు గుర్తు చేశారు.

అనంతరం దేశ ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు శిక్ష విధించిందన్నారు. గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో గతంతో పోలిస్తే.. ఈసారి ఎన్నికల్లో బీజేపీ ఓటు శాతం పెరిగిందని ఆయన కొనియాడారు. ఇక, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల విషయానికొస్తే.. పలు జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ వనరులు రెడ్ గ్రావెల్, శాండ్ వంటిని అధికారంలో ఉన్న పెద్దల చేత దోపిడీకి గురవుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ దోపిడీ కారణంగా ఆదాయాన్ని రాష్ట్రానికి ఇవ్వకుండా, వారే నొక్కేస్తూరాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. త్వరలోనే ఈ శాండ్ రీచ్‌లకు సంబంధించి చార్జీషిట్ దాఖలు చేసే కార్యక్రమాన్ని బీజేపీ చేపట్టనుందని సోము వీర్రాజు తెలిపారు. అక్రమ దందాలపై బీజేపీ ఉద్యమిస్తుందని, రాష్ట్ర వైఫల్యాల గురించి ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత బీజేపీపై ఉందని అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు.

అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలి

ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిగ్బంధంలో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ వనరులైనటువంటి రెడ్ గ్రావెల్, శాండ్ వంటివి రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పెద్దల చేత దోపిడీకి గురవుతున్నాయి. ఆదాయాన్ని రాష్ట్రానికి ఇవ్వకుండా, ఆ ఆదాయాన్ని వారే నొక్కేస్తూ మన రాష్ట్రాన్ని అప్పులు చేసి, ప్రజలపై భారాన్ని పెంచుతున్నారు.-సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details